ఓల్డ్ మలక్‌పేటలో కొనసాగుతున్న రీపోలింగ్
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ పరిధిలోని ఓల్డ్ మలక్‌పేట డివిజన్ పరిధిలో రీపోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. డివిజన్ 26లో బ్యాలెట్ పేపర్లో సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తును ముద్రించారు. గుర్తులు తారుమారు కావడంతో ఎస్ఈసీ రీపోలింగ్ నిర్వహిస్తుంది. మలక్‌పేట డివిజన్ మొత్తం 69 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అయితే వార్డు నెంబర్ 26లో ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా, రీపోలింగ్ సందర్భంగా మలక్‌పేట డివిజన్ లో స్థానిక సెలవు […]
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ పరిధిలోని ఓల్డ్ మలక్‌పేట డివిజన్ పరిధిలో రీపోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. డివిజన్ 26లో బ్యాలెట్ పేపర్లో సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తును ముద్రించారు. గుర్తులు తారుమారు కావడంతో ఎస్ఈసీ రీపోలింగ్ నిర్వహిస్తుంది. మలక్‌పేట డివిజన్ మొత్తం 69 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అయితే వార్డు నెంబర్ 26లో ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
కాగా, రీపోలింగ్ సందర్భంగా మలక్‌పేట డివిజన్ లో స్థానిక సెలవు ప్రకటించారు అధికారులు. డివిజన్ పరిధిలో మొత్తం 54,655 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రీపోలింగ్ సందర్భంగా 12 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 23 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఉండనున్నాయి.