వరంగల్‌లో రెమ్‌డెసివిర్ దందా
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్‌లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల దందా జోరుగా సాగుతోంది. కరోనా రోగుల ప్రాణాపాయ స్థితినే దోపిడీకి అవకాశం మల్చుకుంటున్నాయి ముఠాలు. మార్కెట్లో రూ.2400లు ఉన్న ఇంక్షన్ ధర బ్లాక్ మార్కెట్లో ఏకంగా రూ.35వేల నుంచి రూ.40వేల వరకు విక్రయిస్తున్నారు. వరంగల్ ఎంజీఎం ఉన్నతాధికారుల సహకారంతోనే కొన్ని ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తుండగా.. మరోవైపు హైదరాబాద్, విజయవాడ, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లా కేంద్రాలకు చెందిన కొంతమంది వ్యక్తులు […]
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్‌లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల దందా జోరుగా సాగుతోంది. కరోనా రోగుల ప్రాణాపాయ స్థితినే దోపిడీకి అవకాశం మల్చుకుంటున్నాయి ముఠాలు. మార్కెట్లో రూ.2400లు ఉన్న ఇంక్షన్ ధర బ్లాక్ మార్కెట్లో ఏకంగా రూ.35వేల నుంచి రూ.40వేల వరకు విక్రయిస్తున్నారు. వరంగల్ ఎంజీఎం ఉన్నతాధికారుల సహకారంతోనే కొన్ని ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తుండగా.. మరోవైపు హైదరాబాద్, విజయవాడ, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లా కేంద్రాలకు చెందిన కొంతమంది వ్యక్తులు కూడా ముఠాలుగా ఏర్పడి ఇంజక్షన్లను ఇక్కడకు తరలించి రహస్యంగా విక్రయిస్తున్నారు. మెడికల్ ఏంజెట్లే సూత్రదారులుగా.. ఉంటూ నేరుగా ఆస్పత్రుల యాజమాన్యాలతో పర్సంటేజీల ఒప్పందం కుదుర్చుకుని విక్రయాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన రెండు ముఠాలను హన్మకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన హెల్త్ హబ్‌గా ఉన్న వరంగల్ పట్టణానికి కొవిడ్ రోగులు చికిత్స కోసం తరలివస్తున్నారు. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా వరంగల్ పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రులకు కొవిడ్ చికిత్స అందజేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో కాస్త పేరెన్నికగన్నా ఆస్పత్రుల్లో కూడా ప్రతీ రోజూ లక్షల రూపాయల వైద్య వ్యాపారం జరుగుతుండటం గమనార్హం.
మెడికల్ ఏజంట్లతోనే దందా..
హైదరాబాద్, విజయవాడ కేంద్రంగా ఉన్న పలు ముఠాలు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల విక్రయాలకు దందాకు వరంగల్ పట్టణంలోని ఫార్మసీ రంగంలోని వ్యాపారులు, ఏజెట్లు, ఆస్పత్రిలోని వైద్యులు, యాజమాన్యాల్లోని వ్యక్తులతో పర్సంటేజీలు మాట్లాడుకుని ఒప్పందం కుదర్చుకుంటూ దందా వ్యాపారం సాగిస్తున్నారు. రూ.3వేలు అసలు ధర ఉన్న ఇంజక్షన్ ధరను రూ.30 వేల నుంచి రోగి ఆరోగ్య పరిస్థితులను అంతకు బట్టి అందినకాడికి దండుకుంటున్నట్టు తెలుస్తోంది. ఫుల్‌గా పరిచయం ఉన్న వ్యక్తులతో ఈదందా చేపడుతున్న ముఠాలకు ఎలాంటి రిస్క్‌లు ఉండటం లేదు. వీరి దందా గుట్టు చప్పుడు కాకుండా సవ్యంగా సాగిపోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు వరంగల్ పట్టణంలో చిక్కిన రెండు ముఠాలు కూడా హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కావడం గమనార్హం.
ఇంజెక్ట్ చేయడం లేదు..?
కాజీపేటకు చెందిన ఓ రైల్వే ఉద్యోగి తల్లి ఇటీవల కరోనా బారిన పడింది. కుటుంబ సభ్యులు హన్మకొండ నడిబొడ్డున ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజుల తర్వాత పరిస్థితి విషమంగా ఉందని చెప్పి..రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ఇస్తేనే ప్రాణాపాయం నుంచి తప్పించగలమని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. అప్పటికే దాదాపు 2లక్షలకు పైగా బిల్లు రూపంలో ఆస్పత్రికి ముట్టజెప్పారు. అయినా ఆస్పత్రి వైద్యుల సూచనలతో రూ.35వేలు సమకూర్చి… సదరు ఆస్పత్రిలోనే ఓ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అపరిచితుడిని కలిసి ఇంజక్షన్ తెచ్చుకున్నారు. ఈ ఇంజక్షన్‌ను ఇచ్చినా.. ఆమె సాయంత్రానికే మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అసలు తీసుకువచ్చిన ఇంజక్షన్ కూడా ఇచ్చారో…?! ఇవ్వలేదో అన్న అనుమానాలను ఆ కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.