వాట్సాప్‌లో జియోమార్ట్ సేవలు ప్రారంభం!
దిశ,వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ గతేడాది చివర్లో ఈ-కామర్స్ విభాగంలో జియోమార్ట్‌ను ప్రారంభించింది. పైగా దీనికి ‘దేశ్ కీ నయీ దుకాణ్’ అని పేరుకూడా పెట్టారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీలకు పోటీ ఇవ్వడానికే ఇటీవల ఫేస్‌బుక్‌తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్తులో అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీగా మారేందుకే రిలయన్స్ రిటైల్ విభాగం ఫేస్‌బుక్‌తో జతకట్టింది. పైలట్ ప్రాజెక్టుగా వాట్సాప్‌లో జియో మార్ట్ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా ముంబైలోని నవీ ముంబై, […]
దిశ,వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ గతేడాది చివర్లో ఈ-కామర్స్ విభాగంలో జియోమార్ట్‌ను ప్రారంభించింది. పైగా దీనికి ‘దేశ్ కీ నయీ దుకాణ్’ అని పేరుకూడా పెట్టారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీలకు పోటీ ఇవ్వడానికే ఇటీవల ఫేస్‌బుక్‌తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్తులో అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీగా మారేందుకే రిలయన్స్ రిటైల్ విభాగం ఫేస్‌బుక్‌తో జతకట్టింది. పైలట్ ప్రాజెక్టుగా వాట్సాప్‌లో జియో మార్ట్ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా ముంబైలోని నవీ ముంబై, ఠానే, కళ్యాణ్ ప్రాంతాల్లో ఈ సేవలను అందించనుంది.
దీనికోసం వినియోగదారులు జియో మార్ట్ నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. వస్తువులు కావాల్సిన వారు సదరు నంబర్‌కు మెసే పెట్టిన తర్వాత జియో మార్ట్ నుంచి వినియోగదారుడి నంబర్‌కు లింక్ అందిస్తారు. ఈ లింక్ 30 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. ఆ లింక్ ద్వారా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో వినియోగదారుడి అడ్రస్, ఫోన్ నంబర్ లాంటి కొన్ని వివరాలను నమోదు చేయాలి. వివరాల నమోదు పూర్తయిన తర్వాత అదే పేజీలో ఉన్న వస్తువుల్లోంచి అవసరమైన వాటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్డర్ చేసిన వెంటనే వినియోగదారుడి ఫోన్‌కు స్టోర్‌కు సంబంధించిన వివరాలు వాట్సాప్ నంబర్ ద్వారా అందుతాయి. ఆర్డర్ రెడీ అయిన తర్వాత కూడా ఒక నోటిఫికేషన్ పంపిస్తారు. ఇలా దీన్ని ఉపయోగిస్తారు. ఇప్పటివరకూ క్యాష్ ఆర్డర్లను మాత్రమే అనుమతిస్తున్నారు. అంతేకాకుండా స్టోర్‌కు వినియోగదరులే స్వయంగా వెళ్లాల్సి ఉంటుంది.
Tags : E-Commerce, Facebook Jio Deal, Facebook Reliance Deal, JioMart #WhatsApp