Jio Payments Bank: జియో పేమెంట్స్ బ్యాంక్ బంపర్ ఆఫర్.. కొత్త కస్టమర్లకు రూ. 5,000 రివార్డ్ పాయింట్లు..!

దేశీయ ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) ఇటీవలే ఫైనాన్స్ సెక్టార్(Finance Sector)లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-12-25 15:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) ఇటీవలే ఫైనాన్స్ సెక్టార్(Finance Sector)లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. జియో ఫైనాన్సియల్ సర్వీసెస్(JFS)లోని జియో పేమెంట్స్ బ్యాంక్(Jio Payments Bank) ఆన్‌లైన్ పేమెంట్స్ అగ్రిగేటర్ గా కొనసాగేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గత అక్టోబర్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జియో పేమెంట్స్ బ్యాంక్ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఖాతాదారులను ఆకట్టుకునేందుకు జియో పేమెంట్స్ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్(Christmas), న్యూ ఇయర్(New Year) ఫెస్టివల్ సీజన్ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త ఖాతాదారులకు రూ. 5,000 విలువైన రివార్డ్ పాయింట్లు అందిస్తున్నట్లు తెలిపింది. డిసెంబర్ 25 నుంచి 31 వరకు జియో పేమెంట్స్ బ్యాంకులో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన వారు మెక్ డొనాల్డ్స్, ఈజ్ మై ట్రిప్, మాక్స్ ఫ్యాషన్ వంటి ప్రముఖ బ్రాండుల నుంచి కూపన్లు పొందొచ్చని పేర్కొంది.

కేవలం 5 నిమిషాల్లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్

కాగా జియో ఫైనాన్స్ యాప్ ద్వారా యూజర్లు కేవలం ఐదు నిమిషాల్లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. బయోమెట్రిక్, ఫిజికల్ డెబిట్ కార్డుతో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బ్యాంక్ ఖాతాను క్రియేట్ చేసుకోవచ్చు. యూజర్లు ఈ యాప్ ద్వారా డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ ట్రాన్సక్షన్స్ వంటి సర్వీసులు కూడా పొందొచ్చు. యూపీఐ లావాదేవీలపై స్పెషల్ రివార్డ్స్ పాయింట్స్ కూడా అందించనుంది. అలాగే ఎలాంటి ఫ్లాట్ ఫామ్ ఫీజు లేకుండా మొబైల్ రీఛార్జీలు కూడా చేసుకోవచ్చు. 

Tags:    

Similar News