2021లో జియో ఫోన్‌ను రీలాంచ్ చేయనున్న రిలయన్స్!

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ దిగ్గజ సంస్థ గతంలో జియో ఫోన్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీన్ని మళ్లీ రీలాంచ్ చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది కరోనా కారణంగా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులకు పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో 4జీ ఫోన్‌లకు భారీగా డిమాండ్ పెరిగింది. అంతేకాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ప్రజలెక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ చూడ్డం పెరిగింది. కాబట్టి జియో 4జీని వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో […]

Update: 2020-12-24 10:06 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ దిగ్గజ సంస్థ గతంలో జియో ఫోన్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీన్ని మళ్లీ రీలాంచ్ చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది కరోనా కారణంగా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులకు పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో 4జీ ఫోన్‌లకు భారీగా డిమాండ్ పెరిగింది. అంతేకాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ప్రజలెక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ చూడ్డం పెరిగింది. కాబట్టి జియో 4జీని వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో తీసుకురావాలని, అదేవిధంగా తన ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా దేశీయ మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తోంది.

సరికొత్త స్మార్ట్‌ఫోన్ గూగుల్ భాగస్వామ్యంతో రూపొందిస్తుండగా, దీన్ని కూడా 2021లోనే తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న 20-30 కోట్ల మంది 2జీ వినియోగదారులను లక్ష్యంగానే ఈ ఫోన్‌ను తిరిగి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. 2018లో మొదటగా జియో ఫోన్‌ను లాంచ్ చేశాక, సుమారు 10 కోట్ల జియో ఫోన్‌లను విక్రయించినట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది.

 

 

Tags:    

Similar News