దివాలా స్థితిలో ఉన్న కంపెనీ కొనుగోలుకు రిలయన్స్ ఆసక్తి!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) మరో భాగస్వామి సంస్థతో కలిసి దివాలా స్థితిలో ఉన్న టెక్స్‌టైల్స్ సంస్థ సింటెక్స్ ఇండస్ట్రీస్‌ను కొనేందుకు వేలం వేసినట్టు కంపెనీ తెలిపింది. కోర్టు ఆదేశించిన దివాలా పరిష్కారా ప్రక్రియ కింద సింటెక్స్ ఇండస్ట్రీస్ వేలంలో ఆర్ఐఎల్ సంస్థ అసెట్స్ కేర్ అండ్ రీకన్‌స్ట్రక్షన్‌తో  భాగస్వామ్యం చేసుకుంది. వేలం కోసం పాల్గొంటున్న కంపెనీల్లో జీహెచ్‌సీఎల్ లిమిటెడ్‌తో పాటు ఈజీగో టెక్స్‌టైల్స్, శ్రీకాంత్ వెంచర్స్‌లున్నాయి. ‘రిజల్యూషన్ ప్రక్రియకు సంబంధించి నిపుణుల చేత […]

Update: 2021-12-12 09:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) మరో భాగస్వామి సంస్థతో కలిసి దివాలా స్థితిలో ఉన్న టెక్స్‌టైల్స్ సంస్థ సింటెక్స్ ఇండస్ట్రీస్‌ను కొనేందుకు వేలం వేసినట్టు కంపెనీ తెలిపింది. కోర్టు ఆదేశించిన దివాలా పరిష్కారా ప్రక్రియ కింద సింటెక్స్ ఇండస్ట్రీస్ వేలంలో ఆర్ఐఎల్ సంస్థ అసెట్స్ కేర్ అండ్ రీకన్‌స్ట్రక్షన్‌తో భాగస్వామ్యం చేసుకుంది. వేలం కోసం పాల్గొంటున్న కంపెనీల్లో జీహెచ్‌సీఎల్ లిమిటెడ్‌తో పాటు ఈజీగో టెక్స్‌టైల్స్, శ్రీకాంత్ వెంచర్స్‌లున్నాయి. ‘రిజల్యూషన్ ప్రక్రియకు సంబంధించి నిపుణుల చేత మూల్యాంకనం చేయబడతాయి.

తదుపరి పరిశీలన కోసం క్రెడిటర్స్ ముందు ఉంచనునంట్టు’ సింటెక్స్ ఇండస్ట్రీస్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇటీవల రిలయన్స్ గ్రీన్ ఎనర్జీతో పాటు రిటైల్, ఫ్యాషన్ విభాగాల్లోనూ ప్రవేశిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే భాగస్వామి ద్వారా ఈ వేలంలో పాల్గొన్నట్టు విశ్లేషకులు తెలిపారు. భారత్‌లో లీకూపర్ బ్రాండ్‌ను వినియోగానికి ప్రాపర్టీ రైట్స్‌ను కొన్న రిలయన్స్ సంస్థ ఈ ఏడాది ఫ్యాషన్ బ్రాండ్‌లలో వాటా కొనుగోలుకు ఆసక్తి చూపడం ఇది రెండోసారి కావడం విశేషం. సినెట్క్స్ సంస్థ ఆర్మానీ, హ్యూగో బాస్, డీజిల్, బుర్‌బెరీ సహా ప్రముఖ గ్లోబల్ ఫ్యాషన్ బ్రాండ్‌లకు ఫ్యార్బిక్‌లను అందిస్తుంది.

Tags:    

Similar News