ఫేస్‌బుక్, కేకేఆర్‌తో రిలయన్స్ చర్చలు!

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత ఏడాది ముఖేశ్ అంబానీ (Mukesh ambani) నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) టెలికాం విభాగం రిలయన్స్ జియో(JIO)లో ఫేస్‌బుక్ (Facebook), ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ సంస్థ కేకేఆర్‌ (Kkr)లు పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. సుమారు 30 శాతం వాటాను ఇవి కలిగి ఉన్నాయి. తాజాగా, ఈ రెండు సంస్థలు రిలయన్స్ రిటైల్‌(Reliance retail)లోనూ ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రిటైల్ వ్యపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఆర్ఐఎల్ […]

Update: 2020-09-08 03:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత ఏడాది ముఖేశ్ అంబానీ (Mukesh ambani) నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) టెలికాం విభాగం రిలయన్స్ జియో(JIO)లో ఫేస్‌బుక్ (Facebook), ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ సంస్థ కేకేఆర్‌ (Kkr)లు పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. సుమారు 30 శాతం వాటాను ఇవి కలిగి ఉన్నాయి. తాజాగా, ఈ రెండు సంస్థలు రిలయన్స్ రిటైల్‌(Reliance retail)లోనూ ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రిటైల్ వ్యపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఆర్ఐఎల్ వీటితో ప్రాథమిక చర్చలు ప్రారంభించింది.

కిశోర్ బియానీ నేతృత్వంలో ఉన్న ఫ్యూచర్ గ్రూపునకు చెందిన బిగ్‌బజార్ (Big bazar) సహా ఇతర రిటైల్ వ్యాపారాన్ని చేజిక్కించుకున్న తర్వాత రిలయన్స్ రిటైల్‌లో ఇన్వెస్ట్ చేయాలని RIL తన వాటాదారులను కోరినట్టు సమాచారం. ఫ్యూచర్ గ్రూప్ కంపెనీ (Future group company)లను కొనుగోలు తర్వాత రిలయన్స్ రిటైల్‌పై ఉన్న అంచనాల నేపథ్యంలో ఒప్పందం జరుగుతుందనే హామీ లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే, అమెరికా ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్( Silver lake partners) కూడా దీనికి సంబంధించి చర్చలు జరుపుతోందని, రిలయన్స్ రిటైల్‌లో 1 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్(Investment) చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News