మహిళలకు డిజిటల్ స్కిల్స్ పాఠాలు

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోని మహిళలకు డిజిటల్ నైపుణ్యం (Digital skills) అందించడానికి ఉమెన్స్ గ్లోబల్ డెవలప్‌మెంట్ అండ్ ప్రాస్పరిటీ (W-gdp), యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్(Usaid) కంపెనీలతో రిలయన్స్ ఫౌండేషన్ (Reliance foundation) ఒప్పందం చేసుకుంది. డబ్ల్యూ-జీడీపీ కార్యక్రమంలో అమెరికా డిప్యూటీ సెక్రటరీ స్టీఫెన్ బీగన్ (Stephen beegan) ఈ ఒప్పందం ఖరారు చేశారు. ఈ కార్యక్రమ లైవ్ ఈవెంట్‌లో అమెరికా అధ్యక్షుడి అడ్వైజర్‌గా ఉన్న ఇవాంకా ట్రంప్ (Ivanka trump) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. […]

Update: 2020-08-12 06:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోని మహిళలకు డిజిటల్ నైపుణ్యం (Digital skills) అందించడానికి ఉమెన్స్ గ్లోబల్ డెవలప్‌మెంట్ అండ్ ప్రాస్పరిటీ (W-gdp), యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్(Usaid) కంపెనీలతో రిలయన్స్ ఫౌండేషన్ (Reliance foundation) ఒప్పందం చేసుకుంది. డబ్ల్యూ-జీడీపీ కార్యక్రమంలో అమెరికా డిప్యూటీ సెక్రటరీ స్టీఫెన్ బీగన్ (Stephen beegan) ఈ ఒప్పందం ఖరారు చేశారు. ఈ కార్యక్రమ లైవ్ ఈవెంట్‌లో అమెరికా అధ్యక్షుడి అడ్వైజర్‌గా ఉన్న ఇవాంకా ట్రంప్ (Ivanka trump) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అలాగే, ఇవాంకాతో పాటుగా యూఎస్ఏఐడీ అడ్మినిస్ట్రేటర్ బోనీ గ్లిక్ (Boni glick) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో మాట్లాడిన ఇవాంకా ట్రంప్.. మహిళల ఆర్థిక సాధికారత (Women empowerment)ను ముందుకు తీసుకెళ్లేందుకు వినూత్మ కార్యక్రమాలను నిర్వహించడానికే డబ్ల్యూ-జీడీపీ ఫండ్(Fund) ఏర్పాటు చేశామన్నారు. అమెరికా ప్రభుత్వం సహా ప్రైవేట్ రంగంలోని వనరులను, నైపుణ్యాలను ఉపయోగించుకోనున్నట్టు ఆమె పేర్కొన్నారు. దీనివల్ల ఆయా కమ్యూనిటీ కార్యకలాపాలను ఇంకా సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఈ వర్చువల్ కార్యక్రమంలో పాలొగిన్న రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఛైర్‌పర్శన్ నీతా అంబానీ (Neetha ambani).. డబ్ల్యూ-జీడీపీ ఉమెన్ కనెక్ట్ ఛాలెంజ్ ద్వారా ప్రైవేట్ రంగంలో ఉన్న జెండర్ డివైడ్ (Jender devide) తొలగించేందుకు, మహిళలు వ్యాపార అవకాశాలను పెంపొందించేందుకు, సాధికారిత సాధించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ (Reliance foundation) వివిధ కార్యక్రమాలను చేపడుతుందని వివరించారు. భారత్‌లో అతిపెద్ద టెలికాం వ్యవస్థగా మారిన జియోలో (Jio) దేశవ్యాప్తంగా మొత్తం 12 కోట్ల మంది మహిళా జియోయూజర్లు ఉన్నట్టు కంపెనీ తెలిపింది.

కాగా, ప్రస్తుత ఏడాదిలో రిలయన్స్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవాన్ని(10th aniversery) జరుపుకుంటోంది. ఇప్పటివరకు రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా 3.6 కోట్ల మందికి సేవలు అందించినట్టు తెలిపారు. భారత్‌లో ఉమెన్స్ గ్లోబల్ డెవలప్‌మెంట్ అండ్ ప్రాస్పరిటీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి జియో, రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా పనిచేయనున్నట్టు నీతా అంబానీ పేర్కొన్నారు.

Tags:    

Similar News