2030 నాటికి 100 గిగావాట్ల ఉత్పత్తే లక్షం : ముఖేష్ అంబానీ

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో 2030 నాటికి 100 గిగావాట్లను చేరుకోవాలని లక్ష్యంగా ఉన్నట్టు ముఖేష్ అంబానీ తెలిపారు. దీనికోసం సంస్థకు చెందిన ‘గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్’లో అభివృద్ధి పనులు మొదలుపెట్టామని ‘ఇంటర్నేషనల్ క్లైమెట్ సమ్మిట్-2021’లో ఆర్ఐఎల్ అధినేత ప్రకటించారు. దీనికోసం ఇదివరకే వెల్లడించినట్టుగా రూ. 75 వేల కోట్లను ఖర్చు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి వ్యాపారంపై తమ ప్రణాళికను […]

Update: 2021-09-03 05:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో 2030 నాటికి 100 గిగావాట్లను చేరుకోవాలని లక్ష్యంగా ఉన్నట్టు ముఖేష్ అంబానీ తెలిపారు. దీనికోసం సంస్థకు చెందిన ‘గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్’లో అభివృద్ధి పనులు మొదలుపెట్టామని ‘ఇంటర్నేషనల్ క్లైమెట్ సమ్మిట్-2021’లో ఆర్ఐఎల్ అధినేత ప్రకటించారు. దీనికోసం ఇదివరకే వెల్లడించినట్టుగా రూ. 75 వేల కోట్లను ఖర్చు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి వ్యాపారంపై తమ ప్రణాళికను ఈ ఏడాది ప్రారంభంలో వివరించాం. ఈ కొత్త పెట్టుబడుల ద్వారా రిలయన్స్ సంస్థకు మాత్రమే కాకుండా భారత్‌కు సైతం అత్యంత విలువైన వ్యాపారంగా నిలవనుందని’ ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని ధీరూభాయ్​ అంబానీ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ మొత్తం విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 450 గిగావాట్లని, ఇందులో 2030 నాటికి 100 గిగావాట్ల సామర్థ్యాన్ని చేరుకుంటామన్నారు.

సౌర, పవన్ విద్యుత్ మాదిరే పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు వీలవుతుంది. అలాగే, ఆటో, ఇతర పరిశ్రమలలో ఇతర ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ లాంటి వాటికి ప్రత్యామ్నాయంగా భర్తీ చేయవచ్చు. అంతేకాకుండా మరో దశాబ్ద కాలంలో హైడ్రోజన్ ధరను ఒక కిలో ఒక డాలరుకు తగ్గించడానికి వీలవుతుందన్నారు. అదేవిధంగా శిలాజ ఇంధనాలు, కార్బన్ ఉద్గారాల వినియోగాన్ని తగ్గించి దిగుమతులపై ఆధారపడటం తగ్గించేందుకు సహాయపడుతుందని ముఖేష్ అంబానీ వివరించారు. కాగా, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి విభాగంలో అంతర్జాతీయంగా అత్యంత ఆకర్షణీయమైన దేశాల్లో బహరత్‌లో మూడో స్థానంలో ఉందని ముఖేష్ అంబాని స్పష్టం చేశారు. భారత్ 2022 నాటికి 175 నాటికి గిగావాట్ల లక్ష్యాన్ని కలిగి ఉందన్నారు.

Tags:    

Similar News