రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల

దిశ, ఏపీబ్యూరో : ఎక్కడైనా రైతు బావుంటేనే రాష్ర్టం బావుంటుంది. రైతుల అభివృద్ది కోసం రాష్ర్ట ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని సీఎం వైఎస్​జగన్​ వెల్లడించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం కంప్యూటర్​లో మీట నొక్కి రైతుల ఖాతాలకు మొత్తం రూ.1,766 కోట్లు జమ చేశారు. మూడోవిడత వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్​పథకం కింద రూ.1,120 కోట్లు, నివర్‌ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ.646 […]

Update: 2020-12-29 02:11 GMT

దిశ, ఏపీబ్యూరో : ఎక్కడైనా రైతు బావుంటేనే రాష్ర్టం బావుంటుంది. రైతుల అభివృద్ది కోసం రాష్ర్ట ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని సీఎం వైఎస్​జగన్​ వెల్లడించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం కంప్యూటర్​లో మీట నొక్కి రైతుల ఖాతాలకు మొత్తం రూ.1,766 కోట్లు జమ చేశారు. మూడోవిడత వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్​పథకం కింద రూ.1,120 కోట్లు, నివర్‌ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ.646 కోట్లు చెల్లిస్తున్నట్లు ఈసందర్భంగా సీఎం వెల్లడించారు.

తద్వారా మొత్తం 51.59 లక్షల రైతులు లబ్ది పొందుతున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రైతులను నిలువునా ముంచిందని విమర్శించారు. దీనికి సంబంధించి కేవలం రూ.12 కోట్లు కూడా ఇవ్వలేదని స్వయంగా ఆర్బీఐ వెల్లడించినట్లు సీఎం జగన్​ పేర్కొన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను తమ ప్రభుత్వం వచ్చాక చెల్లించినట్లు గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్న 434 రైతు కుటుంబాలకు సాయం అందించినట్లు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా పంటల పెట్టుబడి కోసం ఏటా రైతులకు రూ,13,500 ఇస్తున్నట్లు తెలిపారు. కౌలు రైతులకు, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకూడా సాయం అందజేస్తున్నామన్నారు.

రైతులకు పంట రుణాల వడ్డీకి సంబంధించి గత ప్రభుత్వం రూ. 904 కోట్లు బాకీ పెట్టిపోతే తాము తీర్చామని సీఎం చెప్పారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద ఈ ఖరీఫ్‌కు రూ.510 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. చివరకు ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు తమ ప్రభుత్వమే చెల్లించినట్లు పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కోసం రూ.1,968 కోట్లు, భారీ వర్షాలు, తుపాను పరిహారం రూ.1,038 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులకు అడుగడుగునా అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. ఉచిత విద్యుత్‌, ఆక్వా రైతుల కోసం రూ.17,430 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. ఉచిత విద్యుత్ పగటి పూట ఇవ్వడం కోసం రూ.1700 కోట్లు, విత్తనాల సబ్సిడీ కింద రూ.383 కోట్ల బకాయిలు కూడా చెల్లించినట్లు తెలిపారు. అధికారంలోకి రాగానే శనగ రైతులకు రూ.300 కోట్లు బోనస్ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

మొత్తంగా 18 నెలల కాలంలో రైతుల కోసం రూ.61,400 కోట్లు ఖర్చుపెట్టినట్లు సీఎం జగన్​ వివరించారు. భవిష్యత్తులో ఉచిత విద్యుత్​పథకానికి ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులోభాగంగా పది వేల మెగావాట్ల సోలార్​ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈపాటికే టెండర్లు కూడా పిలిచినట్లు తెలిపారు. గ్రామాల్లో పంట విత్తినప్పటి నుంచి దిగుబడులు కొనుగోలు దాకా నిల్వ చేసుకునే గోడౌన్లు, ప్రాసెసింగ్​సెంటర్లు, జనతా బజార్లు, నియోజకవర్గాల స్థాయిలో సెకండరీ ప్రాసెసింగ్​యూనిట్లను ఏడాదిలోగా పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం జగన్​ తెలియజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మంత్రి కన్నబాబు, సీఎస్​నీలం సాహ్ని పాల్గొన్నారు.

Tags:    

Similar News