మావోయిస్టు భాస్కర్ పేరిట లేఖ విడుదల
దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ జిల్లా కడంబ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు భాస్కర్ పేరిట ఆదివారం సాయంత్రం ఓ లేఖ విడుదల అయ్యింది. నిన్న రాత్రి చుక్కాలు, బాజీరావులను పోలీసులు పట్టుకొని కాల్చి చంపారని, అరెస్ట్ చేయాల్సిన పోలీసులకు కాల్చి చంపే అధికారం లేదని భాస్కర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పాశవిక అణచివేతకు ఈ ఎన్‌కౌంటర్ ఉదాహారణ అని లేఖలో పేర్కొన్నారు. కార్డన్ సెర్చ్ పేరుతో ప్రజలను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని, టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు […]
దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ జిల్లా కడంబ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు భాస్కర్ పేరిట ఆదివారం సాయంత్రం ఓ లేఖ విడుదల అయ్యింది. నిన్న రాత్రి చుక్కాలు, బాజీరావులను పోలీసులు పట్టుకొని కాల్చి చంపారని, అరెస్ట్ చేయాల్సిన పోలీసులకు కాల్చి చంపే అధికారం లేదని భాస్కర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పాశవిక అణచివేతకు ఈ ఎన్‌కౌంటర్ ఉదాహారణ అని లేఖలో పేర్కొన్నారు. కార్డన్ సెర్చ్ పేరుతో ప్రజలను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని, టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు ప్రజల చేతిలో శిక్ష తప్పదన్నారు.
నిన్న కడంబ అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు చోటు చేసుకొని ఇద్దరు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉట్నూరు, సిర్పూర్ (యు), తిర్యాని మండలాలకు చెందిన 15మంది మావోయిస్టు సానుభూతి పరులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరంతా మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు తేలిందని, మావోయిస్టు భాస్కర్ తృటిలో తప్పించుకున్నారని ఎస్పీ వెల్లడించారు.