కేంద్రం కీలక ఆదేశాలు.. రూ. 50 వేల పరిహారానికి మార్గదర్శకాలు విడుదల

దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా కారణంగా మృతి చెందిన వారికి రూ. 50 వేలు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సోమవారం మార్గదర్శకాలను విడుదల చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. అయితే ఈ పరిహారాన్ని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) ద్వారా ఇవ్వనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దరఖాస్తు చేసిన 30 రోజుల్లోపు పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. దీనికోసం కరోనా కారణంగా మరణించినట్లు […]

Update: 2021-09-27 04:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా కారణంగా మృతి చెందిన వారికి రూ. 50 వేలు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సోమవారం మార్గదర్శకాలను విడుదల చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. అయితే ఈ పరిహారాన్ని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) ద్వారా ఇవ్వనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దరఖాస్తు చేసిన 30 రోజుల్లోపు పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. దీనికోసం కరోనా కారణంగా మరణించినట్లు ధ్రువీకరణ పత్రం (Covid Death Certificate Download) తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది.

 

Tags:    

Similar News