అంబర్ పేట ఫ్లైఓవర్‌కు నిధులివ్విండి

– కేంద్రమంత్రి గడ్కారీకి కేటీఆర్ లేఖ దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ – విజవాడ జాతీయ రహదారి నెంబర్ -65లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఉద్దేశించిన అంబర్ పేట ఫ్లైఓవర్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, అందుకు సంబంధించిన నిధులను 2020-21 వార్షిక ప్రణాళికలో కేటాయించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కోరారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నిథిన్ గడ్కారీకి ఈ మేరకు గురువారం ఆయన ఓ లేఖ రాశారు. ఎన్‌హెచ్ -65లో పనుల కోసం రూ.500 […]

Update: 2020-10-02 04:50 GMT

– కేంద్రమంత్రి గడ్కారీకి కేటీఆర్ లేఖ

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ – విజవాడ జాతీయ రహదారి నెంబర్ -65లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఉద్దేశించిన అంబర్ పేట ఫ్లైఓవర్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, అందుకు సంబంధించిన నిధులను 2020-21 వార్షిక ప్రణాళికలో కేటాయించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కోరారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నిథిన్ గడ్కారీకి ఈ మేరకు గురువారం ఆయన ఓ లేఖ రాశారు. ఎన్‌హెచ్ -65లో పనుల కోసం రూ.500 కోట్ల డీపీఆర్‌ను సిద్ధం చేసినట్టు మంత్రి గుర్తు చేశారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటని, ఐదు మేజర్ ఐటీ కంపెనీలు ఇక్కడ తమ సంస్థలను నెలకొల్పాయని మంత్రి అందులో పేర్కొన్నారు. అంబర్ పేట ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా భూసేకరణకు, పునరావసానికి రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చును భరిస్తోందని, ఎన్‌హెచ్‌లో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు అవసరమైన నిధులను కేటాయించాలని కేటీఆర్ లేఖలో కోరారు.

Tags:    

Similar News