చెయ్యి చేసుకున్నాడు… పదవి పోగొట్టుకున్నాడు
దిశ, రంగారెడ్డి: ఆయన గ్రామ ప్రథమ పౌరుడు. అందరికీ ఆదర్శంగా ఉండాలి ఆయన తీరు. అయితే అధికారం ఉందని, అధికార పార్టీ నేతల అండడండలు ఉన్నాయని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించాడు. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రేగొండి గ్రామ సర్పంచ్ అసబుద్దీన్ హైదర్. అసలు విషయం ఏంటంటే.. గత నెల 23న రేగొండి గ్రామ పంచాయతీ కార్యదర్శి బందయ్యను కులం పేరుతో సర్పంచ్ దుషించాడు. అంతటితో ఊరుకున్నాడా.. చెయ్యి కూడా చేసుకున్నాడు. […]
దిశ, రంగారెడ్డి: ఆయన గ్రామ ప్రథమ పౌరుడు. అందరికీ ఆదర్శంగా ఉండాలి ఆయన తీరు. అయితే అధికారం ఉందని, అధికార పార్టీ నేతల అండడండలు ఉన్నాయని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించాడు. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రేగొండి గ్రామ సర్పంచ్ అసబుద్దీన్ హైదర్. అసలు విషయం ఏంటంటే.. గత నెల 23న రేగొండి గ్రామ పంచాయతీ కార్యదర్శి బందయ్యను కులం పేరుతో సర్పంచ్ దుషించాడు. అంతటితో ఊరుకున్నాడా.. చెయ్యి కూడా చేసుకున్నాడు. దీంతో గ్రామ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సర్పంచ్‌దే తప్పు అంటూ కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. దీంతో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు సర్పంచ్‌ను ఆరు నెలలపాటు పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు వెల్లడించారు.