ముందే ఆగిన వెబ్‌సైట్స్.. మళ్లీ రీ ఓపెన్ అప్పుడేనా..?

దిశ, తెలంగాణ బ్యూరో: మెరుగైన ఆన్‌లైన్​సర్వీసులు అందించేందుకు రెండు రోజులపాటు సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రకటించిన తేదీకంటే ఓ రోజు ముందుగానే అంతరాయం కలిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల సేవలకు తీవ్ర అవరోధం కలిగింది. పలు ప్రాంతాల్లో సర్వర్​మొరాయించింది. ధరణి, ఐజీఆర్ఎస్​వంటి వెబ్​సైట్లు ముందుగానే ఆగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో డాక్యుమెంటేషన్లు చేశారు. కానీ సేవలు నెమ్మదిగా జరిగాయి. దాంతో కొనుగోలు, అమ్మకందార్లతో కార్యాలయాలు నిండిపోయాయి. వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలు మాత్రమే […]

Update: 2021-07-08 07:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మెరుగైన ఆన్‌లైన్​సర్వీసులు అందించేందుకు రెండు రోజులపాటు సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రకటించిన తేదీకంటే ఓ రోజు ముందుగానే అంతరాయం కలిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల సేవలకు తీవ్ర అవరోధం కలిగింది. పలు ప్రాంతాల్లో సర్వర్​మొరాయించింది.

ధరణి, ఐజీఆర్ఎస్​వంటి వెబ్​సైట్లు ముందుగానే ఆగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో డాక్యుమెంటేషన్లు చేశారు. కానీ సేవలు నెమ్మదిగా జరిగాయి. దాంతో కొనుగోలు, అమ్మకందార్లతో కార్యాలయాలు నిండిపోయాయి. వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలు మాత్రమే కాస్త మెరుగ్గా నడిచాయి. ఇక వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్లు మాత్రం పలు జిల్లాల్లో నిలిచిపోయాయి. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, మేడ్చల్ తదితర జిల్లాల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు కొంత మేరకు జరిగాయి. చాలా ప్రాంతాల్లో వ్యవసాయ భూముల లావాదేవీలు నిలిచిపోయినట్లు తెలిసింది.

స్లాట్లు బుక్​చేసుకున్న వారి పేర్లు, వివరాలు అధికారుల దగ్గర ఉంటాయి. ముందుగానే ఈ సమాచారం చేరవేస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. చాలా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు ధరణి వెబ్‌సైట్ ఓపెన్ కావటం లేదు. దాంతో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కావటం లేదని తెలిసింది. తిరిగి ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అధికారుల నుంచి కూడా సరైన సమాధానం రావడం లేదు.

మరో రెండు రోజుల పాటు ఇలాగే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే స్లాట్లు బుక్​చేసుకున్న వారి పరిస్థితి ఏమిటన్న విషయం గందరగోళంలో పడింది. వాళ్ల నిర్ధిష్ట సమయాన్ని ఏ రోజుకు షెడ్యూల్​చేస్తారో అంతుచిక్కడం లేదు. అది దరఖాస్తుదారుల ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుందా? లేక అధికారులే నిర్ణయిస్తారో తెలియడం లేదు. నిజానికి ఈ నెల 9వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 11వ తేదీ రాత్రి 9 గంటల వరకు రాష్ట్ర ప్రభుత్వ వెబ్ సైట్లు, ఆన్​లైన్​సేవలు నిలిచిపోనున్నట్లు డేటా సెంటర్​ప్రకటించింది. కానీ రెండు రోజుల ముందే ఆన్​లైన్​సేవలకు అంతరాయం ఏర్పడడం గమనార్హం.

క్రయ విక్రయాలతో పాటు మీ సేవా కేంద్రాల్లోనూ ఇవే ఇబ్బందులు తలెత్తాయి. ఉదయం నుంచి దరఖాస్తుదారులు తమ కేంద్రాల ముందు క్యూ కట్టారని, కానీ సైట్​ఓపెన్​కాకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మీ సేవా కేంద్రం నిర్వాహకుడు వివరించారు. ఏయే సర్వీసులు అందుబాటులో ఉంటాయి? ఏవేవి ఎప్పటి వరకు నిలిపివేస్తారో స్పష్టంగా ప్రకటిస్తే ఇబ్బందులు తలెత్తేవి కాదన్నారు. పైగా స్లాట్లు బుక్​చేసుకున్న వారికి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు.

శుక్రవారం కూడా బుక్​చేసుకున్న వారున్నారు. వారు కూడా కార్యాలయానికి వచ్చి వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయన్నారు. లాక్​డౌన్​ఎత్తివేత తర్వాత ఆస్తుల క్రయ విక్రయాల జోరు పెరిగింది. ఈ క్రమంలోనే సేవల్లో అంతరాయం కలగడం అసౌకర్యానికి గురి చేసింది.

Tags:    

Similar News