టీకా కోసం రిజిస్ట్రేషన్లు షురూ
న్యూఢిల్లీ: వచ్చే నెల 1వ తేదీ నుంచి 18ఏళ్ల నుంచి 45ఏళ్లలోపు పౌరులకు టీకా వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులు ముందస్తుగానే టీకా కోసం కొవిన్ వెబ్‌సైట్ లేదా ఆరోగ్య సేతు యాప్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నేరుగా టీకా కేంద్రాల్లో నమోదు సదుపాయం వీరికి లేదు. కాబట్టి బుధవారం నుంచే రిజిస్ట్రేషన్లను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ […]
న్యూఢిల్లీ: వచ్చే నెల 1వ తేదీ నుంచి 18ఏళ్ల నుంచి 45ఏళ్లలోపు పౌరులకు టీకా వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులు ముందస్తుగానే టీకా కోసం కొవిన్ వెబ్‌సైట్ లేదా ఆరోగ్య సేతు యాప్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నేరుగా టీకా కేంద్రాల్లో నమోదు సదుపాయం వీరికి లేదు. కాబట్టి బుధవారం నుంచే రిజిస్ట్రేషన్లను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తాజాగా పేర్కొంది. వీరంతా ముందుగానే టీకా కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మే 1వ తేదీ తర్వాత అందుబాటులో ఉండే టీకా కేంద్రాల ప్రస్తుత వివరాలు ప్రభుత్వాలు పొందుపరుస్తున్నాయి. కాగా, 45ఏళ్లకుపైబడినవారి వ్యాక్సినేషన్ యథావిధిగా కొనసాగుతుంది.
కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?