రిజిస్ట్రేషన్ ఫీజులు అదనంగా చెల్లించాల్సిందే..
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన భూముల విలువలు, రిజిస్ట్రేషన్ ఫీజులు గురువారం అమల్లోకి వచ్చాయి. అయితే అంతకు ముందే స్లాట్‌బుక్ చేసుకున్న వారు పాత రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించారు. వారంతా పెరిగిన ధరలకు అనుగుణంగా అదనపు రుసుమును చెల్లించేందుకు ధరణి పోర్టల్‌లో కొత్త మాడ్యూల్‌ను రూపొందించింది. ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న వారు మిగతా సొమ్మును ఈ మాడ్యూల్ ద్వారా చెల్లించాల్సి ఉంది. ధరలు పెరుగుతున్నాయంటూ ముందుస్తుగా స్లాట్లు బుక్ చేసుకున్న […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన భూముల విలువలు, రిజిస్ట్రేషన్ ఫీజులు గురువారం అమల్లోకి వచ్చాయి. అయితే అంతకు ముందే స్లాట్‌బుక్ చేసుకున్న వారు పాత రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించారు. వారంతా పెరిగిన ధరలకు అనుగుణంగా అదనపు రుసుమును చెల్లించేందుకు ధరణి పోర్టల్‌లో కొత్త మాడ్యూల్‌ను రూపొందించింది. ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న వారు మిగతా సొమ్మును ఈ మాడ్యూల్ ద్వారా చెల్లించాల్సి ఉంది.
ధరలు పెరుగుతున్నాయంటూ ముందుస్తుగా స్లాట్లు బుక్ చేసుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. పెరిగిన ఫీజుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా ప్రభుత్వం వదల్లేదు. గురువారం నుంచి ఎవరు క్రయ విక్రయాలు చేసినా కొత్త ధరల ప్రకారమేనని స్పష్టం చేసింది.