సోషల్ మీడియా అంటే భయమే : రెజీనా
దిశ, వెబ్‌డెస్క్: అందాల భామ రెజీనా కాసాండ్రా… ఆచితూచి సినిమాలు చేస్తోంది. కెరియర్ తొలినాళ్లలో గ్లామర్ డాల్‌గా కనిపించిన రెజీనా తర్వాత తన పంథా మార్చేసింది. ‘ఎస్ఎంఎస్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ‘రొటీన్ లవ్ స్టోరీ’, ‘కొత్త జంట’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ, తమిళ భాషల్లోనూ బిజీ అయిపోయిన భామ.. ‘ఎవరు’ సినిమాతో విమర్శకులచే శభాష్ అనిపించుకుంది. నెగెటివ్ రోల్లో […]
దిశ, వెబ్‌డెస్క్: అందాల భామ రెజీనా కాసాండ్రా… ఆచితూచి సినిమాలు చేస్తోంది. కెరియర్ తొలినాళ్లలో గ్లామర్ డాల్‌గా కనిపించిన రెజీనా తర్వాత తన పంథా మార్చేసింది. ‘ఎస్ఎంఎస్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ‘రొటీన్ లవ్ స్టోరీ’, ‘కొత్త జంట’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ, తమిళ భాషల్లోనూ బిజీ అయిపోయిన భామ.. ‘ఎవరు’ సినిమాతో విమర్శకులచే శభాష్ అనిపించుకుంది. నెగెటివ్ రోల్లో దుమ్ముదులిపిన రెజీనా… తర్వాత హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ‘నేనే నా’ సినిమాతో బిజీగా ఉన్న రెజీనా అటు హిందీలోనూ ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’ చిత్రంతో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి భేష్ అనిపించుకుంది.
అయితే అభిమానులతో టచ్‌లో ఉండేందుకు ఇష్టపడే రెజీనా… సోషల్ మీడియాకు మాత్రం కాస్త దూరంగానే ఉంటుంది. ఎందుకని ప్రశ్నిస్తే… నెటిజెన్ల కామెంట్స్‌తో బాధపడాల్సి వస్తుందని ముందు జాగ్రత్త అని చెప్తోంది. ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు వేల మంది పాజిటివ్ కాంప్లిమెంట్స్ ఇచ్చి … ఒక్కరు నెగెటివ్ కామెంట్ చేసినా చాలా బాధపడతానని చెప్పింది రెజీనా. అందుకే సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉంటానని … పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకునేందుకు కాస్త ఆలోచిస్తానని తెలిపింది.
Tags : Regina Cassandra, Evaru, Nenena, SMS, Social Media