పేదలకు ఉచితంగా ఆంబులెన్స్ సౌకర్యం
దిశ, మహబూబ్ నగర్: లాక్ డౌన్ సమయంలో పేదలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మహబూబ్ నగర్ జిల్లా శాఖ ఉచితంగా ఆంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించింది. అంతేకాకుండా, కూల్ డ్రింక్స్ పంపిణీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర రెడ్ క్రాస్ ద్వారా వచ్చిన 2,500 కూల్ డ్రింక్ బాటిల్స్‌ను రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు నటరాజు.. కలెక్టర్ వెంకట్ రావుకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ ద్వారా అందజేసిన ఈ కూల్ డ్రింక్స్‌ను జిల్లాలోని కరోనా […]
దిశ, మహబూబ్ నగర్: లాక్ డౌన్ సమయంలో పేదలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మహబూబ్ నగర్ జిల్లా శాఖ ఉచితంగా ఆంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించింది. అంతేకాకుండా, కూల్ డ్రింక్స్ పంపిణీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర రెడ్ క్రాస్ ద్వారా వచ్చిన 2,500 కూల్ డ్రింక్ బాటిల్స్‌ను రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు నటరాజు.. కలెక్టర్ వెంకట్ రావుకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ ద్వారా అందజేసిన ఈ కూల్ డ్రింక్స్‌ను జిల్లాలోని కరోనా ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు నిత్యావసరాలతో పాటు పంపిణీ చేస్తామని తెలిపారు. సాధారణ జబ్బులు, అత్యవసరమైతే ఆంబులెన్స్ కోసం కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ 08542-241165కు గానీ, రెడ్ క్రాస్ కార్యాలయానికి గానీ ఫోన్ చేయొచ్చని వెల్లడించారు.
Tags: red cross president nataraju, collector, cold drinks distributed, ambulance provided, corona, lockdown