ఇమిటేషన్ రోజులు పోయాయి!

దిశ, వెబ్‌డెస్క్ : ఒకరు చేసినట్లుగా చేయడం వారిని అనుకరించడమే అవుతుంది. ఎక్కడో చూసి మనకు తగినట్లుగా మార్చుకుని ప్రెజెంట్ చేయడం స్ఫూర్తి పొందినట్లు అవుతుంది. అయితే ఇప్పుడు ట్రెండ్‌లో కొనసాగాలంటే మాత్రం ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనం తీసుకురావాలి. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్, యూట్యూబర్స్ ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరు చేసినట్లుగా చేస్తే ఇమిటేషన్ చేశారు, క్రియేటివ్‌గా లేదు అంటారు లేదా ఏదైనా కొత్తగా చేద్దామా అంటే అది అల్రెడీ […]

Update: 2020-10-29 03:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

ఒకరు చేసినట్లుగా చేయడం వారిని అనుకరించడమే అవుతుంది. ఎక్కడో చూసి మనకు తగినట్లుగా మార్చుకుని ప్రెజెంట్ చేయడం స్ఫూర్తి పొందినట్లు అవుతుంది. అయితే ఇప్పుడు ట్రెండ్‌లో కొనసాగాలంటే మాత్రం ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనం తీసుకురావాలి. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్, యూట్యూబర్స్ ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరు చేసినట్లుగా చేస్తే ఇమిటేషన్ చేశారు, క్రియేటివ్‌గా లేదు అంటారు లేదా ఏదైనా కొత్తగా చేద్దామా అంటే అది అల్రెడీ ఎవరో ఒకరు చేసినదై ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం కొట్టుమిట్టాడే కంటెంట్ క్రియేటర్లకు ఇప్పుడు ఒక కొత్త ఐడియా దొరికింది. అదే రీక్రియేషన్. అంటే ఒక పాపులర్ పాటను గానీ, ఫేమస్ సినిమాలోని సన్నివేశాన్ని గానీ ఉన్నది ఉన్నట్లుగా పునఃసృష్టించడం.

అదేంటీ.. అది మళ్లీ కాపీ కొట్టినట్లే అవుతుంది కదా! అని అనుకోవద్దు. కాపీ కొట్టడం వేరు, రీక్రియేషన్ వేరు. రీక్రియేషన్‌లో పాటను మాత్రమే కాదు, పాటలో కనిపించే ప్రతి వస్తువును కూడా ఉన్నది ఉన్నట్లుగా చూపించగలగాలి. కేవలం ప్రధాన నటీనటుల హావభావాలు మాత్రమే కాకుండా వెనకాల ఆర్టిస్టుల కదలికలు కూడా ఉండాలి. ఇంకా చెప్పాలంటే అదే పాటను గానీ, సన్నివేశాన్ని గానీ మళ్లీ కొత్తగా చూస్తున్న అనుభూతి కలగాలి. అలాగని కవర్ వీడియో సాంగ్ అని కూడా అనుకోవద్దు. ఎందుకంటే కవర్ వీడియో సాంగ్‌లో సినిమాటిక్ ఫీల్ ఉంటుంది. చాలా ఎడిటింగ్‌లు, ఎఫెక్ట్‌లు ఉంటాయి. కానీ రీక్రియేషన్‌లో అలా కాదు. అందుబాటులో ఉన్న వస్తువులు, ఉపకరణాలతోనే రీక్రియేట్ చేయాలి.

ఇటీవల పిల్లలందరూ కలిసి ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో ఫైట్‌ను రీక్రియేట్ చేశారు కదా.. అలాగన్నమాట. కేవలం వీళ్లు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది యూట్యూబర్స్, ఇన్‌ఫ్లూయెన్సర్స్ ఇప్పుడు రీక్రియేషన్ బాటపడుతున్నారు. ముఖ్యంగా ఆఫ్రికా, ఇండోనేషియా, జపాన్ దేశాలకు చెందిన భారతీయ సినీ అభిమానులు చేస్తున్న రీక్రియేషన్ వీడియోలు బాగా పాపులర్ అవుతున్నాయి. తూర్పు ఆఫ్రికాకు చెందిన చాటుమండోటా అనే ఇన్‌ఫ్లూయెన్సర్, కుచ్ కుచ్ హోతా హై సినిమాలో సీన్‌ను రీక్రియేట్ చేశాడు. అలాగే ఇండోనేషియాకు చెందిన మరో యూట్యూబర్ భోలే చూడియా పాటను రీక్రియేట్ చేసింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ పాటలను అచ్చుగుద్దినట్లు రీక్రియేట్ చేసే జపనీస్ కపుల్ హిరోమునియేరు యూట్యూబ్ చానల్ చూస్తే రీక్రియేషన్ ఇలా కూడా చేయొచ్చా అనిపించడం తథ్యం!

Tags:    

Similar News