రెండో త్రైమాసికం నుంచి వృద్ధి వేగవంతం : మోర్గాన్ స్టాన్లీ
దిశ, వెబ్‌డెస్క్: చేతన్ ఆహ్య నేతృత్వంలోని మోర్గాన్ స్నాన్లీ ఆర్థికవేత్తల పరిశోధనా పత్రంలో భారత ఆర్థిక వ్యవస్థ రెండో త్రైమాసికం నుంచి రికవరీ పెరుగుతోందని వెల్లడించింది. 2021 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 9.8 శాతంతో సానుకూల వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని పరిశోధనా పత్రంలో ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి కొవిడ్-19 ముందుస్థాయికి చేరుకోవచ్చని భావిస్తున్నారు. ‘2021లో వృద్ధి రికవరీ బలపడుతుందని ఆశిస్తున్నట్టు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపులో […]
దిశ, వెబ్‌డెస్క్: చేతన్ ఆహ్య నేతృత్వంలోని మోర్గాన్ స్నాన్లీ ఆర్థికవేత్తల పరిశోధనా పత్రంలో భారత ఆర్థిక వ్యవస్థ రెండో త్రైమాసికం నుంచి రికవరీ పెరుగుతోందని వెల్లడించింది. 2021 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 9.8 శాతంతో సానుకూల వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని పరిశోధనా పత్రంలో ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి కొవిడ్-19 ముందుస్థాయికి చేరుకోవచ్చని భావిస్తున్నారు.
‘2021లో వృద్ధి రికవరీ బలపడుతుందని ఆశిస్తున్నట్టు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపులో వృద్ధి 5.7 శాతం నుంచి 9.8 శాతానికి మెరుగుపడుతుంది’ అని పరిశోధనా పత్రంలో స్పష్టం చేశారు. అదేవిధంగా, ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే స్వల్పంగా ఎక్కువుంటుందని, ప్రస్తుత లక్ష్యం 4 శాతానికి కొంచెం అధికంగా ఉండొచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా కరోనా ముందునాటి స్థాయికి చేరుకుంటున్న తరుణంలో..అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలు ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని తొలగించేందుకు దోహదపడతాయని నివేదిక పేర్కొంది.