వలస కార్మికుల తరలింపులో రికార్డు

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ నుంచి ఒకే రోజు 50వేల మందిని తరలించి రికార్డు సృష్టించామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. శనివారం ఒక్కరోజే 40 రైళ్ల ద్వారా 50వేల మంది వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలించామని ఆయన వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రం నుంచి 124 రైళ్ల ద్వారా 1 .58 లక్షల మంది వలస కార్మికులను వారి వారి రాష్ట్రాలకు తరలించామని, ఇందుకోసం రూ. 13.15 కోట్లను ప్రభుత్వం ఖర్చు […]

Update: 2020-05-24 09:44 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ నుంచి ఒకే రోజు 50వేల మందిని తరలించి రికార్డు సృష్టించామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. శనివారం ఒక్కరోజే 40 రైళ్ల ద్వారా 50వేల మంది వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలించామని ఆయన వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రం నుంచి 124 రైళ్ల ద్వారా 1 .58 లక్షల మంది వలస కార్మికులను వారి వారి రాష్ట్రాలకు తరలించామని, ఇందుకోసం రూ. 13.15 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మినహా వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల తరలింపు దాదాపు పూర్తయిందని సోమేశ్ కుమార్ అన్నారు. ఒకేరోజు 50 వేలమంది వలస కార్మికులను సాఫీగా తరలించేందుకై కృషి చేసిన రవాణా శాఖ ముఖ్య కారదర్శి సునీల్ శర్మ, నోడల్ అధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, డీజీపీ మహేందర్ రెడ్డి, అడిషనల్ డీజీ జితేందర్, పోలీసు కమిషషనర్లు అంజనీ కుమార్, మహేష్ భగవత్, వీసీ సజ్జనార్, కలెక్టర్లు శ్వేతా మహంతి, అమోయ్ కుమార్, వెంకటేశ్వర్లు, రైల్వే‌శాఖకు సీఎస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News