వర్షం వచ్చాక వాసనకు ఇదే కారణం!

దిశ, వెబ్‌డెస్క్: ఎండాకాలం తర్వాత మొదట వచ్చే వానలు తీసుకొచ్చే వాసనను ఇష్టపడనివారు ఉండరు. సిటీలో కాంక్రీటు జంగిల్లో ఈ వాసన పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు అందరూ ఊర్లలో ఉన్నారు కాబట్టి మొదటి వాన వాసన చూసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ వాసనకు కారణం ఏంటనే విషయాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీనికి ఓ బ్యాక్టీరియా కారణమని ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు పరిశోధకులు కనుక్కున్నారు. స్ట్రెప్టోమైస్‌గా పిలిచే ఈ బ్యాక్టీరియా జియోస్మిన్ అనే […]

Update: 2020-04-07 00:37 GMT

దిశ, వెబ్‌డెస్క్:
ఎండాకాలం తర్వాత మొదట వచ్చే వానలు తీసుకొచ్చే వాసనను ఇష్టపడనివారు ఉండరు. సిటీలో కాంక్రీటు జంగిల్లో ఈ వాసన పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు అందరూ ఊర్లలో ఉన్నారు కాబట్టి మొదటి వాన వాసన చూసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ వాసనకు కారణం ఏంటనే విషయాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

దీనికి ఓ బ్యాక్టీరియా కారణమని ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు పరిశోధకులు కనుక్కున్నారు. స్ట్రెప్టోమైస్‌గా పిలిచే ఈ బ్యాక్టీరియా జియోస్మిన్ అనే సమ్మేళనాన్ని విడుదల చేస్తుంది. ఈ జియోస్మిన్ వాసనకు ఆర్థ్రోపోడ్ వర్గానికి చెందిన చిన్న పురుగు స్ప్రింగ్‌టెయిల్ ఆకర్షణకు గురవుతుంది. ఈ రెండింటి మధ్య సమన్వయ సహజీవనం కారణంగా ఒక రకమైన రసాయనం పుడుతుంది. వర్షం వచ్చినపుడు ఈ రసాయనం కారణంగా వాసన వెలువడుతుందని శాస్త్రవేత్త బట్నర్ తెలిపారు. అయితే 1960ల్లో ఈ వాసనకు చెట్ల నుంచి వెలువడే ఒక రకమైన నూనె కారణమనే విషయం ప్రచారంలో ఉంది.

Tags: Bacteria, Rain smell, Streptomyce, Springtail

Tags:    

Similar News