2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు దేశీయ రియల్ ఎస్టేట్ రంగం..
దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్థికవ్యవస్థ అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని, 2030 నాటికి ఈ రంగం మార్కెట్ పరిమాణం 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. ఇది భారత జీడీపీలో 18-20 శాతానికి సమానమని ఆయన తెలిపారు. పరిశ్రమల సంఘం సీఐఐ శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గత 18 నెలలుగా ఆర్థికవ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటోందని, అయితే, రియల్ ఎస్టేట్ రంగం […]
దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్థికవ్యవస్థ అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని, 2030 నాటికి ఈ రంగం మార్కెట్ పరిమాణం 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. ఇది భారత జీడీపీలో 18-20 శాతానికి సమానమని ఆయన తెలిపారు. పరిశ్రమల సంఘం సీఐఐ శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గత 18 నెలలుగా ఆర్థికవ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటోందని, అయితే, రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
కరోనా మహమ్మారి పరిస్థితుల నుంచి సాధారణ స్థితికి చేరుకుంటున్నాం. రాబోయే సంవత్సరాల్లో ఈ రంగంలో రూ. 1.25 లక్షల కోట్ల విలువైన అవకాశాలను కల్పించే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(ఆర్ఈఐటీ)కి సెబీ ఇప్పటికే ఆమోదం తెలిపిందని కాంత్ పేర్కొన్నారు. అలాగే, 100 నగరాలను నిర్మించే ప్రణాళికతో మొదలైన స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు మెరుగైన అవకాశమని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య, ఆర్థిక ఉద్దీపన చర్యలు, ఈ రంగంలోని పరిశ్రమలు, వ్యాపారాలకు కీలక మద్దతుగా నిలుస్తుందని అమితాబ్ కాంత్ వివరించారు.