‘వారందరికీ మళ్లీ టెస్టులు చేయాలి’

న్యూఢిల్లీ: కేవలం 24 గంటల వ్యవధిలోనే కొత్త కేసులు సుమారు లక్షకు చేరువైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కిట్‌(ఆర్‌ఏటీ) తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ కిట్‌లో నెగెటివ్ రిపోర్టు వచ్చి లక్షణాలు కనిపించినవారందరికీ తప్పకుండా ఆర్‌టీ-పీసీఆర్ కిట్ ద్వారా టెస్టులు నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈ రిపోర్టులో నెగెటివ్ వస్తేనే వైరస్ లేనట్టుగా నిర్ధారించుకోవాలని తెలిపింది. తద్వారా ఆర్ఏటీలో నెగెటివ్ వచ్చిన కరోనా ఉన్న వ్యక్తిని వదిలిపెట్టకుండా, వైరస్‌ను […]

Update: 2020-09-10 04:31 GMT

న్యూఢిల్లీ: కేవలం 24 గంటల వ్యవధిలోనే కొత్త కేసులు సుమారు లక్షకు చేరువైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కిట్‌(ఆర్‌ఏటీ) తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ కిట్‌లో నెగెటివ్ రిపోర్టు వచ్చి లక్షణాలు కనిపించినవారందరికీ తప్పకుండా ఆర్‌టీ-పీసీఆర్ కిట్ ద్వారా టెస్టులు నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈ రిపోర్టులో నెగెటివ్ వస్తేనే వైరస్ లేనట్టుగా నిర్ధారించుకోవాలని తెలిపింది.

తద్వారా ఆర్ఏటీలో నెగెటివ్ వచ్చిన కరోనా ఉన్న వ్యక్తిని వదిలిపెట్టకుండా, వైరస్‌ను వ్యాపింపజేయకుండా అడ్డుకోవచ్చునని పేర్కొంది. తప్పుడు నెగెటివ్ రిపోర్టులను వీలైనంత స్వల్ప సమయంలోనే గుర్తించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సంయుక్తంగా రాష్ట్రాలకు లేఖ రాశాయి. కొవిడ్ టెస్టులకు ఆర్‌టీ-పీసీఆర్ ఉన్నత ప్రమాణాలకు కలిగి ఉంటుందని పునరుద్ఘాటించింది.

తక్కువ ధర, వేగంగా ఫలితాలనిస్తున్నందున యాంటీజెన్ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్‌లనే రాష్ట్రాలు అత్యధికంగా వినియోగిస్తున్నాయి. అయితే, ఈ టెస్టింగ్ కిట్‌ల ద్వారా నిర్వహిస్తున్న పరీక్షల్లో తప్పుడు ఫలితాలు వస్తున్నాయి. కరోనా వైరస్ ఉన్నప్పటికీ నెగెటివ్ చూపిస్తున్నట్టు తెలిసింది. 24 గంటల వ్యవధిలో కరోనా కొత్త కేసుల సంఖ్య లక్షకు చేరువవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ సూచనలు చేయడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 95,735 కేసులు నమోదయ్యాయి. 1,172 మరణాలు చోటుచేసుకున్నాయి.

Tags:    

Similar News