'తహసీల్దార్ ఆఫీస్‌కు తాళి' ఘటనపై ఆర్డీవో విచారణ
దిశ, వేములవాడ: తమ భూమిని అధికారులు వేరే వాళ్ల పేర పట్టా జారీ చేశారని ఆరోపిస్తూ తహసీల్దార్ ఆఫీస్‌కు మహిళ తాళి కట్టిన ఘటనపై గురువారం సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాస్ రావు విచారణ చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి తహశీల్దార్ కార్యాలయానికి మానాలకు చెందిన మంగ తాళి బొట్టు కట్టిన సంఘటనపై జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించారు. సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాస్ రావును విచారణ అధికారిగా నియమించారు. గురువారం మానాలలో […]
దిశ, వేములవాడ: తమ భూమిని అధికారులు వేరే వాళ్ల పేర పట్టా జారీ చేశారని ఆరోపిస్తూ తహసీల్దార్ ఆఫీస్‌కు మహిళ తాళి కట్టిన ఘటనపై గురువారం సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాస్ రావు విచారణ చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి తహశీల్దార్ కార్యాలయానికి మానాలకు చెందిన మంగ తాళి బొట్టు కట్టిన సంఘటనపై జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించారు. సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాస్ రావును విచారణ అధికారిగా నియమించారు. గురువారం మానాలలో బాధితురాలుకు జరిగిన అన్యాయంపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగ అనే మహిళలకు జరిగిన భూమి మార్పిడిపై విచారణ చేశామని, పూర్తి నివేదిక కలెక్టరు సమర్పించిన తదుపరి చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. అయన వెంట మండల అధికారులు ఉన్నారు.