స్పుత్నిక్-వి తయారీకి హెటెరోతో ఒప్పందం!
దిశ, వెబ్‌డెస్క్: రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను దేశీయంగా తయారుచేసేందుకు హైదరాబాద్‌కు చెందిన హెటెరో కంపెనీతో ఒప్పందం కుదిరింది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్)తో వ్యాక్సిన్ తయారీ ఒప్పందాన్ని చేసుకున్నట్టు హెటెరో శుక్రవారం వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా 10 కోట్ల డోసుల వ్యాక్సిన్ తయారీని చేపడటామని, 2021 ప్రారంభంలో తయారీ మొదలుకావచ్చని అంచనా వేస్తున్నట్టు ఆర్‌డీఐఎఫ్ అభిప్రాయపడింది. అయితే, హెటెరో వ్యాక్సిన్ తయారుచేసేందుకు ప్రత్యేకమైన యూనిట్ల సౌకర్యం లేకపోయినప్పటికీ హైదరాబాద్‌లోని బయో ఫార్మాస్యూటికల్ ప్లాంట్‌లో వ్యాక్సిన్‌ను […]
దిశ, వెబ్‌డెస్క్: రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను దేశీయంగా తయారుచేసేందుకు హైదరాబాద్‌కు చెందిన హెటెరో కంపెనీతో ఒప్పందం కుదిరింది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్)తో వ్యాక్సిన్ తయారీ ఒప్పందాన్ని చేసుకున్నట్టు హెటెరో శుక్రవారం వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా 10 కోట్ల డోసుల వ్యాక్సిన్ తయారీని చేపడటామని, 2021 ప్రారంభంలో తయారీ మొదలుకావచ్చని అంచనా వేస్తున్నట్టు ఆర్‌డీఐఎఫ్ అభిప్రాయపడింది.
అయితే, హెటెరో వ్యాక్సిన్ తయారుచేసేందుకు ప్రత్యేకమైన యూనిట్ల సౌకర్యం లేకపోయినప్పటికీ హైదరాబాద్‌లోని బయో ఫార్మాస్యూటికల్ ప్లాంట్‌లో వ్యాక్సిన్‌ను రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్టు కంపెనీ పేర్కొంది. స్పుత్నిక్-వి తయారీ కోసం హెటెరోతో ఒప్పందం చేసుకోవడం ద్వారా భారతీయ ప్రజలకు సురక్షితమైన, ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ను అందించనున్నట్టు ఆర్‌డీఐఎఫ్ సీఈవో కిరిల్ డిమిత్రేవ్ చెప్పారు. కాగా, స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కు సంబంధించి రెండు, మూడు దశల క్లినికల్ పరీక్షలను నిర్వహించేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌లో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తవచ్చని ఇటీవల డాక్టర్ రెడ్డీస్ అంచనా వేసింది.
స్పుత్నిక్-వి దేశీయంగా తయారు చేయగలిగితే తక్కువ వ్యవధిలో ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించే అవకాశముంటుందని హెటెరో ల్యాబ్స్ ఇంటర్‌నేషనల్ మార్కెటింగ్ డైరెక్టర్ మురళీ కృష్ణారెడ్డి ఆర్‌డీఐఎఫ్‌తో ఒప్పందం సందర్భంగా చెప్పారు. దేశీయంగా జరిగే క్లినికల్ పరీక్షలు దీనికి ఎంతో తోడ్పడనున్నట్టు పేర్కొన్నారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ పరీక్షలు జరుగుతున్నాయని ఆర్‌డీఐఎఫ్ తెలిపింది. రష్యాలో జరిగిన మూడో దశ పరీక్షల మధ్యంతర డేటా ప్రకారం 91.4 శాతం సానుకూల ఫలితాలు సాధించినట్టు వెల్లడించారు. అంతేకాకుండా, స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఒక డోసుకు 10 డాలర్లు(మన కరెన్సీలో రూ. 740) కంటే తక్కువకే అందించాలని భావిస్తున్నట్టు ఆర్‌డీఐఎఫ్ తెలిపింది.