RC15: చరణ్ పై క్లాప్ కొట్టిన చిరు.. డిఫరెంట్ లుక్ లో రచ్చ చేసిన రణవీర్
దిశ, సినిమా : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సౌత్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ శంకర్ ఫస్ట్ టైమ్ కలిసి పనిచేయబోతున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం #RC15 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై 50వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ ఈ రోజు పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబడగా.. ఈ వేడుకలో ముగ్గురు స్టార్ సెలబ్రిటీలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కాస్ట్ […]
దిశ, సినిమా : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సౌత్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ శంకర్ ఫస్ట్ టైమ్ కలిసి పనిచేయబోతున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం #RC15 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై 50వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ ఈ రోజు పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబడగా.. ఈ వేడుకలో ముగ్గురు స్టార్ సెలబ్రిటీలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ ను పరిచయం చేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను బట్టి హీరోయిన్‌గా కియారా అద్వానీ, ఇతర రోల్స్‌లో అంజలి, జయరామ్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సునీల్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ ప్రెస్టీజియస్ సినిమాకు ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందించనున్నాడు.
To new beginnings !!#RC15 #SVC50 kick starts today. Looking forward to deliver a memorable experience to one and all.@shankarshanmugh @advani_kiara @MusicThaman @DOP_Tirru @ramjowrites @saimadhav_burra @SVC_official pic.twitter.com/VRkDfYneQi
— Ram Charan (@AlwaysRamCharan) September 8, 2021
https://www.facebook.com/Dishacinema
ఇక హైదరాబాద్‌లో జరిగిన లాంచింగ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు రాజమౌళితో పాటు హాజరైన బాలీవుడ్ యాక్టర్ రణ్‌వీర్ సింగ్ పాల్గొని చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ముహూర్తపు సన్నివేశంలో భాగంగా తనయుడు రామ్ చరణ్ పై చిరంజీవి క్లాప్ కొట్టి షూటింగ్ ని ప్రారంభించారు. ఇక తన ఐకాన్ ఫ్యాషన్‌తో బాలీవుడ్‌లో సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న రణ్‌వీర్.. ఈ వేడుకకు కూడా డిఫరెంట్ హెయిర్‌స్టైల్‌లో అటెండ్ అయ్యి అందరి అటెన్షన్ క్యాచ్ చేశాడు. దీంతో ఈ వేడుకలో కెమెరా కళ్లన్ని రణవీర్ మీదే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
Pics from #RC15 launch today ! #SVC50 pic.twitter.com/lIFDXmwfqd
— Prashanth Rangaswamy (@itisprashanth) September 8, 2021
రెండు పోనీటైల్స్ తో ట్రెండీ లుక్ లో రణవీర్ చూపరులను ఆకట్టుకున్నాడు. కొత్తగా ఏ ట్రెండ్ వచ్చినా వెంటనే అన్ని ఇండస్ట్రీల యంగ్ హీరోస్ అదే స్టైల్‌ను ఫాలో అయిపోతుంటారు. చూస్తుంటే రణ్‌వీర్ న్యూ హెయిర్‌స్టైల్ కూడా ట్రెండింగ్‌లోకి వచ్చే అవకాశముంది. ఇలాంటి స్టైల్ ఫాలో కావడంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముందుంటాడని తెలిసిందే. చూద్దాం.. రణ్‌వీర్ స్టైల్ ఎంత పాపులర్ అవుతుందో!
#RanveerSingh catches up with #KiaraAdvani and #RamCharan’s at the commencement event of #SVC50. pic.twitter.com/lHxqkCSmqU
— Filmfare (@filmfare) September 8, 2021