ప్రభుత్వానికి ఆర్‌బీఐ అభ్యర్థన
దిశ, సెంట్రల్ డెస్క్: కొవిడ్-19 సంక్షోభం మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీలో ఉన్న పార్ట్ టైమ్ సభ్యుల పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ ప్రభుత్వాన్ని సంప్రదించినట్టు తెలిస్తోంది. ఆర్‌బీఐ యాక్ట్ ప్రకారం.. పార్ట్‌టైమ్ లేదా ఎంపీసీ ఎక్స్‌టర్నల్ మెంబర్స్ పదవీ కాలం నాలుగేళ్లు ఉంటుంది. దీన్ని పొడిగించడం కుదరదు. ఈ సభ్యుల్లో పమీ దువా, చేతన్ ఘాటే, రవీంద్ర ధోలాకియ పదవీ కాలం సెప్టెంబర్‌లో ముగుస్తుండటంతో దీన్ని పొడిగించాలని ఆర్‌బీఐ ప్రభుత్వాన్ని […]
దిశ, సెంట్రల్ డెస్క్: కొవిడ్-19 సంక్షోభం మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీలో ఉన్న పార్ట్ టైమ్ సభ్యుల పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ ప్రభుత్వాన్ని సంప్రదించినట్టు తెలిస్తోంది. ఆర్‌బీఐ యాక్ట్ ప్రకారం.. పార్ట్‌టైమ్ లేదా ఎంపీసీ ఎక్స్‌టర్నల్ మెంబర్స్ పదవీ కాలం నాలుగేళ్లు ఉంటుంది. దీన్ని పొడిగించడం కుదరదు. ఈ సభ్యుల్లో పమీ దువా, చేతన్ ఘాటే, రవీంద్ర ధోలాకియ పదవీ కాలం సెప్టెంబర్‌లో ముగుస్తుండటంతో దీన్ని పొడిగించాలని ఆర్‌బీఐ ప్రభుత్వాన్ని కోరనుంది. కరోనా వ్యాప్తి తర్వాత ఈ కమిటీ మార్చి 27న, ఏప్రిల్ 17న, మే 22న మూడు సార్లు ఉద్దీపనను, నియంత్రణ చర్యలను ప్రకటించింది. ప్రస్తుతానికి ఆర్‌బీఐ ప్రతిపాదించిందని, ప్రభుత్వం నుంచి స్పందన ఇంకా వెలువడలేదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఒకవేళ ఆర్‌బీఐ అభ్యర్థనను అంగీకరించి, సెప్టెంబర్ తర్వాత ద్రవ్య విధాన కమిటీలోని ఆయా సభ్యుల పదవీ కాలాన్ని కొనసాగించాలని నిర్ణయిస్తే, ఆర్‌బీఐ యాక్ట్‌లో మార్పులు చేయవలసి ఉంటుందని, ఆర్‌బీఐ అభ్యర్థనపై ప్రభుత్వానికి ఆగష్టు వరకు సమయం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.