కాంగ్రెస్ సీనియర్ నేతకు షాక్..
న్యూఢిల్లీ: లోక్‌సభలో కాంగ్రెస్ సభాపక్షనేతగా లూధియానా ఎంపీ రన్‌వీత్ సింగ్ బిట్టూ నియమితులయ్యారు. పంజాబ్‌కు చెందిన రన్‌వీత్.. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత బీంట్ సింగ్ మనవడు. కాగా, ప్రస్తుతం లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న అధీర్ రంజన్ చౌదరిని బెంగాల్ పీసీసీ అధ్యక్షుడిగా నియమించడంతో ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. బెంగాల్‌లో ఎన్నికల నేపథ్యంలో ఆయన అక్కడే ఉండాల్సి రావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తున్నది. అయితే డిప్యూటీ ఫ్లొర్ లీడర్‌గా […]
న్యూఢిల్లీ: లోక్‌సభలో కాంగ్రెస్ సభాపక్షనేతగా లూధియానా ఎంపీ రన్‌వీత్ సింగ్ బిట్టూ నియమితులయ్యారు. పంజాబ్‌కు చెందిన రన్‌వీత్.. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత బీంట్ సింగ్ మనవడు. కాగా, ప్రస్తుతం లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న అధీర్ రంజన్ చౌదరిని బెంగాల్ పీసీసీ అధ్యక్షుడిగా నియమించడంతో ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. బెంగాల్‌లో ఎన్నికల నేపథ్యంలో ఆయన అక్కడే ఉండాల్సి రావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తున్నది. అయితే డిప్యూటీ ఫ్లొర్ లీడర్‌గా ఉన్న గౌరవ్ గొగోయ్‌కు ఈ బాధ్యతలు అప్పజెప్తారని అనుకున్నా అసోం ఎన్నికలు ఉండటంతో ఆయన కూడా అందుబాటులో లేని పరిస్థితి తలెత్తింది. దీంతో రన్‌వీత్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఎన్నికల తర్వాత అధీర్ రంజన్ తిరిగి బాధ్యతలు స్వీకరించనున్నారని కాంగ్రెస్ తెలిపింది.