కుమారస్వామి బాధ్యత ఉండక్కర్లేదా? : రవీనా టాండన్

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ పెళ్లిపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. సమాజంలో ప్రముఖులు బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఉండాల్సిన అవసరం లేదా అని తిట్టిపోస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుంటే … మీరు విందులు, వినోదాలు అంటూ ఇలా ప్రవర్తించడం ఏంటని మండిపడుతున్నారు. పెళ్లికి హాజరైన 60 మందిలో ఒక్కరు కూడా కనీసం మాస్క్ లు కూడా ధరించకపోవడం నెటిజన్లను ఫైర్ అయ్యేలా చేస్తోంది. పోలీసులు, డాక్టర్లు ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తుంటే […]

Update: 2020-04-17 08:09 GMT
కుమారస్వామి బాధ్యత ఉండక్కర్లేదా? : రవీనా టాండన్
  • whatsapp icon

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ పెళ్లిపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. సమాజంలో ప్రముఖులు బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఉండాల్సిన అవసరం లేదా అని తిట్టిపోస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుంటే … మీరు విందులు, వినోదాలు అంటూ ఇలా ప్రవర్తించడం ఏంటని మండిపడుతున్నారు. పెళ్లికి హాజరైన 60 మందిలో ఒక్కరు కూడా కనీసం మాస్క్ లు కూడా ధరించకపోవడం నెటిజన్లను ఫైర్ అయ్యేలా చేస్తోంది. పోలీసులు, డాక్టర్లు ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తుంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ పెళ్లి తంతుపై మండిపడింది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్. కరోనా కారణంగా దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని… కొందరు ఆప్తులను చేరుకునేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారని… పేదలు తిండి లేక బాధ పడ్తున్నారన్న ఆమె… ధనికులు ఇలా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ జల్సా చేస్తున్నారని మండిపడింది. పెళ్లిలో ఎంత ఫుడ్ వేస్ట్ చేశారోనని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ టైంలో ఇదంతా అవసరమా అంటూ విమర్శలు గుప్పించింది.

Tags : Raveena Tandon, Bollywood, CoronaVirus, Covid19, Corona, Kumaraswamy, Nikhil

Tags:    

Similar News