తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేడు ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీవారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై చంద్రప్రభ వాహనంతో రథసప్తమి వేడుకలు ముగియనున్నాయి. తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తర్వాత సూర్యప్రభ వాహనంంతో రథసప్తమి వేడుకలను ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై, 9 నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనంపై, 11 నుంచి 12 గంటల వరకు […]

Update: 2021-02-18 20:58 GMT
తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేడు ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీవారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై చంద్రప్రభ వాహనంతో రథసప్తమి వేడుకలు ముగియనున్నాయి.

తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తర్వాత సూర్యప్రభ వాహనంంతో రథసప్తమి వేడుకలను ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై, 9 నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనంపై, 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు శ్రీవారికి చక్రస్నానం చేయించనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనంపై, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపై, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Tags:    

Similar News