వాటి కోసం రోడ్డెక్కిన మహిళలు.. పట్టించుకోని అధికారులు

దిశ, వాజేడు : తాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడి దొడ్డి గ్రామం జాతీయ రహదారిపై గుమ్మడి గ్రామ గిరిజనులు తాగునీటి బిందెలతో రాస్తారోకో నిర్వహించారు.  గత వారం రోజులుగా గుమ్మడి పంచాయతీలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు తెచ్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. మిషన్ భగీరథ తాగునీరు సరఫరా నిలిచిపోవడంతో తాగు […]

Update: 2021-08-05 02:39 GMT

దిశ, వాజేడు : తాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడి దొడ్డి గ్రామం జాతీయ రహదారిపై గుమ్మడి గ్రామ గిరిజనులు తాగునీటి బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. గత వారం రోజులుగా గుమ్మడి పంచాయతీలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు తెచ్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.

మిషన్ భగీరథ తాగునీరు సరఫరా నిలిచిపోవడంతో తాగు నీటి ఎద్దడి పెరిగి బిందెడు మంచినీళ్లు దొరకడం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి పంచాయతీ సర్పంచ్ గాని, కార్యదర్శిగాని పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్య పరిష్కారం కోరుతూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో కారణంగా గంటపాటు రవాణా సౌకర్యం స్తంభించింది పోలీసులు రంగ ప్రవేశం చేసి రాస్తారోకోను విరమింపజేశారు.

Tags:    

Similar News