థియేటర్ స్టాఫ్‌కు మెగా ఫ్యాన్స్ హెల్ప్..
అభిమానులకు అన్నయ్యగా.. సినీ కార్మికుల ఆపదలు తీర్చే ఆపద్బాంధవుడిగా.. కరోనా మహమ్మారి ప్రభావంతో బాధపడుతున్న సినీ వర్కర్ల కడుపు నింపిన అందరివాడుగా.. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారినవాడు.. మెగాస్టార్ చిరంజీవి. కార్మికుల సమస్యలు పరిష్కరిస్తూ.. ప్రస్తుత జనరేషన్‌ను ప్రోతాహిస్తూ ఇండస్ట్రీ పెద్దన్నగా కొనసాగుతున్న ‘చిరు’ అడుగుజాడల్లోనే ఆయన అభిమానులు కూడా నడుస్తున్నారు. ఈ క్రమంలో తన పుట్టినరోజును అంతే గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించారు. ఆగస్ట్ 22న చిరు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎప్పటిలాగే సేవా కార్యక్రమాలు చేపడుతున్న […]
అభిమానులకు అన్నయ్యగా.. సినీ కార్మికుల ఆపదలు తీర్చే ఆపద్బాంధవుడిగా.. కరోనా మహమ్మారి ప్రభావంతో బాధపడుతున్న సినీ వర్కర్ల కడుపు నింపిన అందరివాడుగా.. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారినవాడు.. మెగాస్టార్ చిరంజీవి. కార్మికుల సమస్యలు పరిష్కరిస్తూ.. ప్రస్తుత జనరేషన్‌ను ప్రోతాహిస్తూ ఇండస్ట్రీ పెద్దన్నగా కొనసాగుతున్న ‘చిరు’ అడుగుజాడల్లోనే ఆయన అభిమానులు కూడా నడుస్తున్నారు. ఈ క్రమంలో తన పుట్టినరోజును అంతే గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించారు.
ఆగస్ట్ 22న చిరు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎప్పటిలాగే సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఫ్యాన్స్.. ఈ సారి కొత్తగా థియేటర్ వర్కర్స్‌కు హెల్ప్ చేయాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ‘రామ్ చరణ్ యువశక్తి’ తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ స్టాఫ్‌కు రేషన్ సరుకులు, కూరగాయలు, శానిటైజర్స్‌తో పాటు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేందుకు డిసైడ్ అయ్యారు. కాగా, కరోనా కారణంగా మూడు నెలలుగా జీతాల్లేక.. థియేటర్ స్టాఫ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.