ప్రకృతి మాతకు పచ్చదనం అవసరం : రాశి ఖన్నా

మనం నివసించే ప్రపంచాన్ని పరిరక్షించడం.. వ్యక్తిగత, సామూహిక బాధ్యతన్న దలైలామా సూచనలు అనుసరిద్దామని పిలుపునిస్తోంది అందాల భామ రాశి ఖన్నా. క్యూట్ హీరోయిన్ రష్మిక మందాన గ్రీన్ ఇండియా చాలెంజ్ యాక్సెప్ట్ చేసిన రాశి.. తన నివాసంలో గులాబీతో పాటు మరో రెండు మొక్కలు నాటింది. ఈ సమయంలో ప్రకృతి మాతకు పచ్చదనం మరింత అవసరమని చెప్తోంది. దీనిని ప్రతి ఒక్కరం వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని.. మొక్కలు నాటుదామని సూచించింది. అంతేకాదు వాటిని పరిరక్షించే బాధ్యత కూడా […]

Update: 2020-07-20 05:27 GMT
ప్రకృతి మాతకు పచ్చదనం అవసరం : రాశి ఖన్నా
  • whatsapp icon

మనం నివసించే ప్రపంచాన్ని పరిరక్షించడం.. వ్యక్తిగత, సామూహిక బాధ్యతన్న దలైలామా సూచనలు అనుసరిద్దామని పిలుపునిస్తోంది అందాల భామ రాశి ఖన్నా. క్యూట్ హీరోయిన్ రష్మిక మందాన గ్రీన్ ఇండియా చాలెంజ్ యాక్సెప్ట్ చేసిన రాశి.. తన నివాసంలో గులాబీతో పాటు మరో రెండు మొక్కలు నాటింది. ఈ సమయంలో ప్రకృతి మాతకు పచ్చదనం మరింత అవసరమని చెప్తోంది. దీనిని ప్రతి ఒక్కరం వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని.. మొక్కలు నాటుదామని సూచించింది. అంతేకాదు వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని కోరింది.

https://www.instagram.com/p/CC22HuzJw4O/?igshid=mc6k80coenc4

హరా హై తో భరా హై (గ్రీన్ ఇండియా) చాలెంజ్‌కు తనను నామినేట్ చేసినందుకు రష్మికకు థాంక్స్ చెప్పిన రాశి.. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, తమన్నా భాటియాను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నట్లు తెలిపింది. అభిమానులందరూ కూడా చాలెంజ్‌ను స్వీకరించి.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ను ఇందులో భాగస్వాములను చేయాలని కోరింది.

https://www.instagram.com/p/CC2z1cJJq6h/?utm_source=ig_web_copy_link

Tags:    

Similar News