ఫిల్మ్ మేకర్స్‌కు రణ్‌బీర్ వార్నింగ్!
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ రాక్‌స్టార్ రణ్‌బీర్ కపూర్ వరుస ప్రాజెక్టులతో తీరికలేకుండా ఉన్నాడు. 2018లో రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్‌లో వచ్చిన ‘సంజు’ సినిమాలో చివరగా కనిపించిన రణ్‌బీర్.. 2022 వరకు బిజీ షెడ్యూల్‌లో ఉండనున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్‌లన్నీ వాయిదా పడగా, లాక్‌డౌన్ ఎత్తేశాక ‘షంషేరా’ సినిమాను ఏడురోజుల షెడ్యూల్‌తో కంప్లీట్ చేశాడు రణ్‌బీర్. ఆ తర్వాత ఆలియా భట్, నాగార్జున, మౌనీరాయ్‌తో కలిసి ముంబైలో 10 రోజుల పాటు బ్రహ్మాస్త్ర సినిమా చిత్రీకరణలో […]
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ రాక్‌స్టార్ రణ్‌బీర్ కపూర్ వరుస ప్రాజెక్టులతో తీరికలేకుండా ఉన్నాడు. 2018లో రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్‌లో వచ్చిన ‘సంజు’ సినిమాలో చివరగా కనిపించిన రణ్‌బీర్.. 2022 వరకు బిజీ షెడ్యూల్‌లో ఉండనున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్‌లన్నీ వాయిదా పడగా, లాక్‌డౌన్ ఎత్తేశాక ‘షంషేరా’ సినిమాను ఏడురోజుల షెడ్యూల్‌తో కంప్లీట్ చేశాడు రణ్‌బీర్. ఆ తర్వాత ఆలియా భట్, నాగార్జున, మౌనీరాయ్‌తో కలిసి ముంబైలో 10 రోజుల పాటు బ్రహ్మాస్త్ర సినిమా చిత్రీకరణలో పాల్గొన్నాడు.
మరో వైపు లవ్ రంజన్ డైరెక్షన్‌లో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా వస్తున్న సినిమా షూటింగ్ జనవరి 6 నుంచి ప్రారంభం కానుండగా.. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లో షూటింగ్ జరగనుంది. జనవరి 14తో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కానుండగా, ఆ తర్వాత మళ్లీ బ్రహ్మాస్త్ర షూట్‌లో జాయిన్ కానున్నాడు ఆర్‌కే. జనవరి ఎండింగ్ వరకు కూడా బ్రహ్మాస్త్ర సినిమాతో స్టిక్ అయిపోనున్నాడు. ఆ తర్వాత లవ్ రంజన్ సినిమా కోసం విదేశాలకు వెళ్లనున్న రణ్‌బీర్.. ఒకవేళ బ్రహ్మాస్త్ర షూటింగ్ కంప్లీట్ కాకపోతే మళ్లీ అదే సినిమాకు డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఏనిమల్’, సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ మూవీ ‘బాయిజు బవ్రా’ సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి.
అలాంటప్పుడు బ్రహ్మాస్త్ర సినిమా విషయంలో జరిగినట్లు ఒక్క సినిమాకే ఏళ్లకేళ్లుగా స్టిక్ అయిపోయి.. ఎక్స్‌ట్రా డేట్స్ సర్దుబాటు చేయలేడు కాబట్టి ఫిల్మ్ మేకర్స్‌కు ఓ హెచ్చరిక ఇచ్చారట. తను చేసే సినిమాలు ఇన్‌టైమ్‌లో కంప్లీట్ చేయాలని.. ఎక్స్‌ట్రా డేట్స్ కేటాయించాల్సి వస్తే ఎక్స్‌ట్రా రెమ్యునరేషన్ కూడా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశాడట. దీంతో అసలే కరోనా కాలంలో బిజినెస్ జరగక తాము బాధపడుతుంటే.. ఇదేం వార్నింగ్ అని భయపడిపోతున్నారట మేకర్స్.