మహిళా జట్టులో మార్పు రావాలి : కోచ్ పవార్

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మహిళా క్రికెట్ జట్టు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నదని.. జట్టు అవసరాలకు తగినట్లుగా సైద్దాంతిక మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన కోచ్ రమేష్ పవార్ అన్నారు. ప్రస్తుతం జట్టులో సీనియర్ ప్లేయర్, కెప్టెన్ మిథాలీ రాజ్ బాగా ఆడుతూ ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేస్తొందని, కానీ ఆమెకు తోడుగా మరో బ్యాటర్ అవసరం మిడిల్ ఆర్డర్‌లో కావాల్సి ఉన్నదని రమేష్ పవార్ అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు మహిళల జట్టు ఒక […]

Update: 2021-07-15 08:57 GMT

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మహిళా క్రికెట్ జట్టు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నదని.. జట్టు అవసరాలకు తగినట్లుగా సైద్దాంతిక మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన కోచ్ రమేష్ పవార్ అన్నారు. ప్రస్తుతం జట్టులో సీనియర్ ప్లేయర్, కెప్టెన్ మిథాలీ రాజ్ బాగా ఆడుతూ ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేస్తొందని, కానీ ఆమెకు తోడుగా మరో బ్యాటర్ అవసరం మిడిల్ ఆర్డర్‌లో కావాల్సి ఉన్నదని రమేష్ పవార్ అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు మహిళల జట్టు ఒక సిద్దాంతంతో ఆడుతున్నారు.

వారి సైద్దాంతిక పద్దతిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని పవార్ అన్నారు. ఇప్పటికీ మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్న బ్యాటర్లు భయంతో ఆడుతున్నారు. ఆధునిక క్రికెట్ అంటే భయపడటం కాదని వారికి చెప్పి.. వారిలో మార్పు తీసుకొని రావాల్సి ఉన్నది. ఇప్పటివరకైతే మా ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయని పవార్ అన్నారు. ఉన్న వారిలో మార్పు తీసుకొని రావడం లేదా కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం అని తేల్చి చెప్పాడు. భవిష్యత్‌లో మరిన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని పవార్ పేర్కొన్నారు.

 

Tags:    

Similar News