ఏంటి బ్రో అలా అనేశాడు.. నా దృష్టిలో ప్రభాస్ ఒక నార్మల్ యాక్టర్ మాత్రమే, లెజెండ్ కాదు.. దుమారం రేపుతున్న మంచు విష్ణు కామెంట్స్

హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa).

Update: 2025-04-25 06:36 GMT
ఏంటి బ్రో అలా అనేశాడు.. నా దృష్టిలో ప్రభాస్ ఒక నార్మల్ యాక్టర్ మాత్రమే, లెజెండ్ కాదు.. దుమారం రేపుతున్న మంచు విష్ణు కామెంట్స్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa). ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న మూవీని.. అవా ఎంటర్‌టైన్మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్, శరత్ కుమార్ వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా ఈ మూవీ జూన్ 27న థియేటర్లలో గ్రాండ్‌‌గా విడుదల కానుంది.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్ల జోరు పెంచారు మూవీ టీమ్. ఇందులో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన విష్ణు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభాస్ నా దృష్టిలో నార్మల్ యాక్టర్ మాత్రమే. లెజెండ్ యాక్టర్ కాదు. ఆయన లెజెండ్‌గా మారడానికి ఇంకా టైం పడుతది.. కానీ మోహన్ లాల్ మాత్రం లెజెండరీ యాక్టర్. ఎందుకంటే కాలం మోహన్‌లాల్‌ను లెజండరీ యాక్టర్‌ను చేసింది.. రాబోయే కాలంలో ప్రభాస్‌ చేసే సినిమాలు తప్పకుండా ఏదోఒక రోజు లెజెండ్‌ను చేస్తాయి’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మంచు విష్ణు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. అయ్యా ఏంటి మన డార్లింగ్‌ను అంత పెద్ద మాట అనేశాడు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News