రామారెడ్డి ఏపీవో అవినీతి చిట్టా విప్పిన అపరిచితుడు..?

దిశ, రామారెడ్డి : ప్రభుత్వ సొమ్మును అందినకాడికి దండుకుంటూ కుబేరులవుతున్నారు కొందరు. అక్రమాలకు పాల్పడుతూనే సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ వారి నుంచి లంచాలు వసూలు చేస్తున్నారు మరికొందరు. ఇంతటి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వ ఉన్నతాధికారులు. ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వస్తు్న్నా చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారు. తాజాలా అలాంటి ఘటనే ఒకటి రామారెడ్డి మండలంలో చోటుచేసుకున్నా అధికారులు దానిని చూసీచూడనట్టు వ్యవహరించారని చర్చ నడుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి […]

Update: 2021-10-24 07:59 GMT

దిశ, రామారెడ్డి : ప్రభుత్వ సొమ్మును అందినకాడికి దండుకుంటూ కుబేరులవుతున్నారు కొందరు. అక్రమాలకు పాల్పడుతూనే సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ వారి నుంచి లంచాలు వసూలు చేస్తున్నారు మరికొందరు. ఇంతటి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వ ఉన్నతాధికారులు. ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వస్తు్న్నా చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారు. తాజాలా అలాంటి ఘటనే ఒకటి రామారెడ్డి మండలంలో చోటుచేసుకున్నా అధికారులు దానిని చూసీచూడనట్టు వ్యవహరించారని చర్చ నడుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రామారెడ్డి మండలం ఏపీవో ధర్మారెడ్డి చాలా అక్రమాలు చేశారని ఓ అపరిచితుడు 8 పేజీల లేఖను మండలంలోని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పంపినట్టు తెలిసింది. ఏపీవో గతంలో పనిచేసిన జక్రాన్ పల్లి, నాగిరెడ్డి పేట, లింగంపేట మండలాల్లో ఇన్చార్జిగా పనిచేసిన సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్టు లేఖలో పేర్కొన్నారు.

2012‌లో ఉద్యోగంలో చేరిన రెండేళ్ళలోనే రూ.30 లక్షలతో ఇళ్ళు నిర్మించారని, వైకుంఠ ధామాలు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులలో 10 నుంచి 20 శాతం కమీషన్లు తీసుకున్నట్టు తెలిసిందన్నారు. ఉపాధి హామీ పథకం పనుల్లో విపరీతంగా అవినీతికి పాల్పడినట్టు ఆరోపించారు. మద్దికుంటలో ఓ వ్యక్తిని వికలాంగుడు కాకపోయిన లంచం తీసుకుని, వికలాంగుల గ్రూపులో చేర్చినట్లు సమాచారం. రామారెడ్డి, రెడ్డిపేట గ్రామాల్లో అవినీతి జరుగుతుందని తెలిసినా ఎవరూ పట్టించుకోకపోవడం విచారకరం. ఈయన పనిచేసిన ప్రతీచోట అవినీతి, అక్రమాలకు అంతులేదని లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది.ఈ లేఖ విషయంపై ఎంపీడీవోను వివరణ అడుగగా అది లేఖ మాత్రమే అని, ఫిర్యాదు అందలేదని.. అందుకే కేవలం దానిని లేఖగా మాత్రమే పరిగణిస్తామన్నారు. దీనిపై ఏపీవో ధర్మారెడ్డిని వివరణ కోరగా గిట్టనివారే ఈ లేఖను సృష్టించారని అవన్నీ అవాస్తవమని తెలిపారు.

Tags:    

Similar News