Ramanaidu Birth Anniversary : నేడు మూవీ మొఘల్ ‘రామానాయుడు’ జయంతి..
దిశ, వెబ్‌డెస్క్ : నేడు ప్రముఖ లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు 85వ జయంతి. ఈ సందర్భంగా మూవీ మొఘల్‌ను ఒక్కసారి స్మరించుకుందాం. రామానాయడు 1936వ సంవత్సరం జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లాలోని కారంచేడులో జన్మించాడు. వివిధ భాషాల్లో వందకు పైగా చిత్రాలను నిర్మించి, ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. అందుకే రామానాయుడును మూవీ మొఘల్‌గా అభివర్ణిస్తారు. సినిమా రంగంలో రామానాయుడు చేసిన […]
దిశ, వెబ్‌డెస్క్ : నేడు ప్రముఖ లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు 85వ జయంతి. ఈ సందర్భంగా మూవీ మొఘల్‌ను ఒక్కసారి స్మరించుకుందాం. రామానాయడు 1936వ సంవత్సరం జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లాలోని కారంచేడులో జన్మించాడు. వివిధ భాషాల్లో వందకు పైగా చిత్రాలను నిర్మించి, ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. అందుకే రామానాయుడును మూవీ మొఘల్‌గా అభివర్ణిస్తారు.
సినిమా రంగంలో రామానాయుడు చేసిన కృషికి గానూ 2010 సెప్టెంబరు 9న భారత ప్రభుత్వం నాయుడికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. ఇక, రామానాయుడు సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ ప్రవేశం కూడా చేశారు. ఆయన 1999లో బాపట్ల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. సినిమా ఇండస్ట్రీకి రామానాయుడు పలువురు ప్రముఖ నటులను అందించారు.