ధృవ షూటింగ్ ఫొటోలు అదుర్స్
కరోనా కారణంగా సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉంటూ.. తమకు నచ్చిన పని చేస్తున్నారు. డ్యాన్స్, గేమ్స్, వర్కవుట్స్ చేస్తూ ఫ్యామిలీతో గడుపుతున్నారు. కానీ, ఇన్ని రోజుల లాక్‌డౌన్‌తో బయట ప్రపంచాన్ని చాలానే మిస్ అవుతున్నారు. ఇక సినీస్టార్స్ గురించి చెప్పక్కర్లేదు. రోజూ సినిమా షూటింగ్‌లు, సెట్స్.. ఆ హడావిడి అంతా వేరుగా ఉంటుంది. అందుకే త్వరగా ఆ ప్రపంచంలోకి వెళ్లిపోతే బాగుండని ఆరాటపడుతున్నారు. ఈ కోవలోకే చేరారు మెగా పవర్ […]
కరోనా కారణంగా సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉంటూ.. తమకు నచ్చిన పని చేస్తున్నారు. డ్యాన్స్, గేమ్స్, వర్కవుట్స్ చేస్తూ ఫ్యామిలీతో గడుపుతున్నారు. కానీ, ఇన్ని రోజుల లాక్‌డౌన్‌తో బయట ప్రపంచాన్ని చాలానే మిస్ అవుతున్నారు. ఇక సినీస్టార్స్ గురించి చెప్పక్కర్లేదు. రోజూ సినిమా షూటింగ్‌లు, సెట్స్.. ఆ హడావిడి అంతా వేరుగా ఉంటుంది. అందుకే త్వరగా ఆ ప్రపంచంలోకి వెళ్లిపోతే బాగుండని ఆరాటపడుతున్నారు. ఈ కోవలోకే చేరారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.
లాక్డౌన్లో ఇంట్లో ఉపాసనకు హెల్ప్ చేస్తూ.. తన పని తాను చేసుకుంటున్న చరణ్.. సినిమా షూటింగ్ మిస్ అవుతున్నట్లు చెప్పాడు. ధృవ షూటింగ్ టైమ్‌లో తీసిన ఫొటోలను షేర్ చేసిన చరణ్.. మళ్లీ సెట్స్ మీదకు వెళ్లేందుకు ఆతృతగా ఉందన్నారు.
కాగా చరణ్ పోస్ట్‌పై స్పందించింది కో యాక్టర్ రకుల్ ప్రీత్ సింగ్.. ‘ధృవ షూటింగ్ టైమ్‌లో చాలా ఎంజాయ్ చేశాం’ అని తెలిపింది.