దెబ్బతిన్న మొక్కలతో అసెంబ్లీకి..

దిశ, ఏపీ బ్యూరో : నివర్ తుపానుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వరకు ర్యాలీగా వెళ్లారు. ఫ్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. జీవనోపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవాలని డిమాండ్​చేశారు. ప్రతీ పేద కుటుంబానికి రూ.10వేలు ఇవ్వాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పంటల బీమా ప్రీమియం రైతులు చెల్లిస్తామన్నా అడ్డు పడ్డారు. రాష్ర్ట ప్రభుత్వమూ కట్టలేదు. రైతులను నిండా […]

Update: 2020-11-30 07:57 GMT

దిశ, ఏపీ బ్యూరో : నివర్ తుపానుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వరకు ర్యాలీగా వెళ్లారు. ఫ్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. జీవనోపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవాలని డిమాండ్​చేశారు. ప్రతీ పేద కుటుంబానికి రూ.10వేలు ఇవ్వాలన్నారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పంటల బీమా ప్రీమియం రైతులు చెల్లిస్తామన్నా అడ్డు పడ్డారు. రాష్ర్ట ప్రభుత్వమూ కట్టలేదు. రైతులను నిండా ముంచేశారని దుయ్యబట్టారు. బీమా సొమ్మును ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్​చేశారు. మైక్రో ఇరిగేషన్ సబ్సిడీకి మంగళం పాడారాని చెప్పారు. రైతులకు రూ.20 వేల కోట్ల భరోసాను ఎగ్గొట్టినట్టు తెలిపారు. టీడీపీ హయాంలో అమలు చేసిన అన్నదాతా సుఖీభవ పథకాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. రుణ మాఫీ కింద రూ.8 వేల కోట్లను ఎగవేసినట్లు ఆరోపించారు. మోటార్లకు మీటర్లు బిగిస్తే రైతులే వైసీపీని తరిమికొడతారని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీది మోసగాళ్ల పాలనగా వర్ణించారు.

 

Tags:    

Similar News