సెక్స్ వర్కర్ గా రకుల్..?

రకుల్ ప్రీత్ సింగ్ అందం, అభినయం కలగలిసిన ముద్దుగుమ్మ. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో గ్లామర్ టచ్ ఇస్తూనే నటనతోనూ సూపర్ అనిపించుకుంది. అయితే కొత్త హీరోయిన్ల రాకతో రకుల్ కష్టాల్లో పడిందని, క్యారెక్టర్లు రావడం లేదని చాలా మంది విమర్శిస్తున్నా.. తన సినిమాలతో తాను బిజీగానే ఉంది. అయితే ఒక స్టేజ్ వరకే గ్లామర్ పని చేస్తుంది.. సినిమాల్లో రాణించాలంటే యాక్టింగ్ మాత్రమే పనిచేస్తుందని ముందుగానే తెలుసున్న రకుల్.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ రోల్ ఓకే […]

Update: 2020-07-13 05:47 GMT

రకుల్ ప్రీత్ సింగ్ అందం, అభినయం కలగలిసిన ముద్దుగుమ్మ. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో గ్లామర్ టచ్ ఇస్తూనే నటనతోనూ సూపర్ అనిపించుకుంది. అయితే కొత్త హీరోయిన్ల రాకతో రకుల్ కష్టాల్లో పడిందని, క్యారెక్టర్లు రావడం లేదని చాలా మంది విమర్శిస్తున్నా.. తన సినిమాలతో తాను బిజీగానే ఉంది. అయితే ఒక స్టేజ్ వరకే గ్లామర్ పని చేస్తుంది.. సినిమాల్లో రాణించాలంటే యాక్టింగ్ మాత్రమే పనిచేస్తుందని ముందుగానే తెలుసున్న రకుల్.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ రోల్ ఓకే చేసిందట.

ముంబై రెడ్ లైట్ ఏరియాలో నివసించే మహిళల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారి బాధలను లోకానికి చూపించే ఉద్దేశంతో ఓ వేశ్య జీవితాన్ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారట ప్రముఖ దర్శకుడు. కాగా ఈ బోల్డ్ పాత్రకు రకుల్‌ను సంప్రదించగా.. తను కూడా ఓకే చేసిందట. నటనా ప్రాధాన్యమున్న పాత్ర కావడం.. ఇలాంటి క్యారెక్టర్లు చేసిన నటీమణులు గొప్ప పేరు తెచ్చుకోగా వారి బాటలోనే పయనిస్తోంది రకుల్.

Tags:    

Similar News