కంగనానే అతిపెద్ద దేశ ద్రోహి.. నటి షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ రాఖీ సావంత్ తాజాగా కంగనా రనౌత్‌పై విరుచుకుపడింది. 2014లో స్వాతంత్ర్యం వచ్చిందనే కంగన వ్యాఖ్యలను తప్పుపడుతూ.. ‘ద్రోహి’ అంటూ ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘దేశానికి 1947లో బ్రిటీష్ వాళ్లు పెట్టిన భిక్ష మన స్వాతంత్ర్యం’ అన్న కంగన కామెంట్స్‌ను కుక్క అరుస్తున్నట్లు ఎడిట్ చేసిన రాఖీ.. ‘ఈ సోదరి పెద్ద దేశ ద్రోహి’ అని […]
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ రాఖీ సావంత్ తాజాగా కంగనా రనౌత్‌పై విరుచుకుపడింది. 2014లో స్వాతంత్ర్యం వచ్చిందనే కంగన వ్యాఖ్యలను తప్పుపడుతూ.. ‘ద్రోహి’ అంటూ ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘దేశానికి 1947లో బ్రిటీష్ వాళ్లు పెట్టిన భిక్ష మన స్వాతంత్ర్యం’ అన్న కంగన కామెంట్స్‌ను కుక్క అరుస్తున్నట్లు ఎడిట్ చేసిన రాఖీ.. ‘ఈ సోదరి పెద్ద దేశ ద్రోహి’ అని రాసుకొచ్చింది. ఇక ఈ కామెంట్స్‌పై స్పందించిన నెటిజన్లు.. ‘నిజం చెప్పావ్ దీదీ! నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’ అని ఒకరంటే.. ‘నేటి నుంచి మన నేషనల్ క్రష్ రాఖీ సావంత్, మీ మీద నాకు చాలా గౌరవం పెరిగింది రాఖీ’ అని మరొకరు కామెంట్ చేశారు.
ఇక మరికొందరు రాఖీ వీడియోపై విమర్శలు గుప్పించగా.. దీనికి సమాధానంగా మరో వీడియో షేర్ చేసింది. ఆసుపత్రి బెడ్‌పై పడుకుని భారత స్వాతంత్ర్యం గురించి కొంతమంది తప్పుడు వ్యాఖ్యలు చేయడమే తన దుస్థితికి కారణమని వ్యంగ్యంగా మాట్లాడింది. అలాగే ‘మన దేశానికి 2014లో స్వాతంత్ర్యం వచ్చిందని కొందరు చెబుతున్నారు. నేను చాలా షాక్ అయ్యాను. అందుకే ఘాటు రిప్లయ్ ఇచ్చాను. మిగతా దేశ భక్తులంతా కూడా తగిన గుణపాఠం చెప్పాలి’ అని పేర్కొంది. ఇక కంగన వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా ఖండించిన విషయం తెలిసిందే.