2022లో ఎగరనున్న 'ఆకాశ ఎయిర్' విమానాలు!

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టాక్ మార్కెట్ల బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా త్వరలో విమాన యాన రంగంలో ప్రవేశించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఆకాశ’ అనే బ్రాండ్ పేరుతో రానున్న ఎస్ఎన్‌వీ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విమానయాన సేవలందించేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) అందుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. ‘పౌర్ విమానయాన మంత్రిత్వ శాఖ ఎన్ఓసీ మంజూరు చేయడం సంతోషంగా ఉంది. ఆకాశ బ్రాండ్‌ను విజయవంతంగా ప్రారంభించేందుకు అవసరమైన […]

Update: 2021-10-11 10:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టాక్ మార్కెట్ల బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా త్వరలో విమాన యాన రంగంలో ప్రవేశించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఆకాశ’ అనే బ్రాండ్ పేరుతో రానున్న ఎస్ఎన్‌వీ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విమానయాన సేవలందించేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) అందుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. ‘పౌర్ విమానయాన మంత్రిత్వ శాఖ ఎన్ఓసీ మంజూరు చేయడం సంతోషంగా ఉంది. ఆకాశ బ్రాండ్‌ను విజయవంతంగా ప్రారంభించేందుకు అవసరమైన అన్ని నిబంధనలను అనుసరించి, నియంత్రణ అధికారులతో కలిసి పనిచేస్తామని’ ఆకాశ ఎయిర్ సీఈఓ వినయ్ దూబె అన్నారు.

‘2022 ఆరంభం నుంచి ‘ఆకాశ ఎయిర్’ దేశవ్యాప్తంగా విమాన సేవలందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దేశీయంగా అత్యంత విశ్వసనీయ, సరసరమైన విమానయాన సంస్థగా ఉండాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నాం. దేశ పురోగతికి బలమైన వాయు రవాణా వ్యవస్థ కీలకమని తాము భావిస్తున్నట్టు’ ఆయన వివరించారు. ఈ నమ్మకంతోనే ఆధునిక, సమర్థవంతమైన, నాణ్యమైన ఎయిర్‌లైన్స్‌ని తెచ్చేందుకు ప్రేరణను ఇస్తోందన్నారు.

Tags:    

Similar News