కేసీఆర్… నన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదు !

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాజ్యసభ ఎంపీ డీఎస్ విమర్శలు చేశారు. నేను టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తే ఎందుకు సస్పెండ్ చేయలేదని సీఎంను ప్రశ్నించారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ తనను అవమానించారని డీఎస్ ఆవేదన చెందారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను కీలక పాత్ర పోషించానని, సోనియా గాంధీని ఒప్పించడానికి ఎంతో కష్టపడ్డానో తనకే తెలుసన్నారు. కేసీఆర్ కేవలం ఓట్లు సాధించే రాజకీయం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ కూతురు కవిత… తనకు వ్యతిరేకంగా కుట్రలు […]

Update: 2020-09-28 07:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాజ్యసభ ఎంపీ డీఎస్ విమర్శలు చేశారు. నేను టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తే ఎందుకు సస్పెండ్ చేయలేదని సీఎంను ప్రశ్నించారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ తనను అవమానించారని డీఎస్ ఆవేదన చెందారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను కీలక పాత్ర పోషించానని, సోనియా గాంధీని ఒప్పించడానికి ఎంతో కష్టపడ్డానో తనకే తెలుసన్నారు. కేసీఆర్ కేవలం ఓట్లు సాధించే రాజకీయం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ కూతురు కవిత… తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నానంటూ తనపై హైకమాండ్‌కు కవిత లేఖ రాశారని, ఆ లేఖపై సంతకాలు చేసిన సగమంది ఎమ్మెల్యేలు తనకు ఫోన్ చేసి… ఒత్తిడి తట్టుకోలేకనే సంతకం చేసినట్లు వెల్లడించారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన డీఎస్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News