వచ్చే నెల 9న రాజ్యసభ బై పోల్

న్యూఢిల్లీ: రాజ్యసభలో ఖాళీగా ఉన్న సీటుకు వచ్చేనెల 9న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్(ఈసీ) శుక్రవారం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌ నుంచి దినేశ్ త్రివేది రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. తృణమూల్ కాంగ్రెస్‌(టీఎంసీ) తరఫున రాజ్యసభకు వెళ్లిన దినేశ్ త్రివేది బెంగాల్‌లో జరుగుతున్న హింసపై ఏమీ చేయలేకపోతున్నానని వాపోతూ ఫిబ్రవరి 12న రాజీనామా చేసి, టీఎంసీని వీడారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. 2026వరకు కొనసాగాల్సిన ఆయన రాజీనామా చేయడంతో ఖాళీ […]

Update: 2021-07-16 09:16 GMT

న్యూఢిల్లీ: రాజ్యసభలో ఖాళీగా ఉన్న సీటుకు వచ్చేనెల 9న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్(ఈసీ) శుక్రవారం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌ నుంచి దినేశ్ త్రివేది రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. తృణమూల్ కాంగ్రెస్‌(టీఎంసీ) తరఫున రాజ్యసభకు వెళ్లిన దినేశ్ త్రివేది బెంగాల్‌లో జరుగుతున్న హింసపై ఏమీ చేయలేకపోతున్నానని వాపోతూ ఫిబ్రవరి 12న రాజీనామా చేసి, టీఎంసీని వీడారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. 2026వరకు కొనసాగాల్సిన ఆయన రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈసీ వచ్చే నెల 9న ఉప ఎన్నిక నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 22న విడుదల చేయనున్నట్టు వెల్లడించింది.

Tags:    

Similar News