ఆయన కోసమే సుమను పక్కన పెట్టా – రాజీవ్ కనకాల

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో యాంకర్ సుమ, రాజీవ్ కనకాల జంట కూడా ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎప్పుడు అన్యోన్యంగానే కనిపిస్తారు. 21 ఏళ్ల  వీరి వివాహబంధంపై గతకొన్ని రోజులుగా సోషల్ మీడియా లో రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. సుమ, రాజీవ్ విడిపోయారని, వారిద్దరూ ఇప్పుడు విడిగా ఉంటున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఇక తాజాగా ఈ వార్తలపై రాజీవ్ కనకాల స్పందించారు. ఇటీవల రాజీవ్ నటించిన ‘నారప్ప’ చిత్రం మంచి […]

Update: 2021-07-27 04:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో యాంకర్ సుమ, రాజీవ్ కనకాల జంట కూడా ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎప్పుడు అన్యోన్యంగానే కనిపిస్తారు. 21 ఏళ్ల వీరి వివాహబంధంపై గతకొన్ని రోజులుగా సోషల్ మీడియా లో రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. సుమ, రాజీవ్ విడిపోయారని, వారిద్దరూ ఇప్పుడు విడిగా ఉంటున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఇక తాజాగా ఈ వార్తలపై రాజీవ్ కనకాల స్పందించారు. ఇటీవల రాజీవ్ నటించిన ‘నారప్ప’ చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా చేసిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

సోషల్ మీడియాలో సుమ, తాను విడిపోయామన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసిన రాజీవ్ ఒక సమయంలో తాము విడిగా ఉన్నామని తెలిపారు. “అవును.. నేను, సుమ విడిగా ఉన్నాం. మా అమ్మ లక్ష్మి కనకాల చనిపోయినప్పుడు నాన్న దేవదాస్ కనకాల ఒక్కరే ఇంట్లో ఉండేవారు. మణికొండలో ఉన్న ఇంట్లో ఆయనకు పెద్ద లైబ్రరీ ఉండేది. మేమున్న ఇంటికి దాన్ని షిఫ్ట్ చేయలేక కొన్ని రోజులు నేను నాన్న తోనే ఉండాల్సి వచ్చింది. సుమ, పిల్లలు వేరే ఇంట్లో ఉండేవారు.. నేను, నాన్నతో కలిసి మణికొండలో ఉండేవాడిని. దీన్ని చూసి సుమ, నేను విడిపోయామని వార్తలు వచ్చాయి. ఇంకొన్ని యూట్యూబ్ చానెల్స్ అయితే ఏకంగా విడాకులు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చాయి. అయితే.. ఈ వార్తలన్నీ అవాస్తవాలని, సుమ, రాజీవ్ ఎప్పటికి కలిసే ఉంటారని” తెలిపారు. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవని, సుమ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు.

Tags:    

Similar News