మావోయిస్టుల పేరిట లేఖ మంత్రి ఎర్రబెల్లి సృష్టే..

దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టలన్నా మంత్రి ఎర్రబెల్లికి కమీషన్లు ముట్టజెప్పాల్సిందేనని వరంగల్ మాజీ డీసీసీబీ చైర్మన్, జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి మాట్లాడారు. తనపై మావోయిస్టు పార్టీ లేఖ విడుదలంతా మంత్రి దయాకర్ రావు సృష్టించాడన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన […]

Update: 2020-08-28 04:13 GMT

దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టలన్నా మంత్రి ఎర్రబెల్లికి కమీషన్లు ముట్టజెప్పాల్సిందేనని వరంగల్ మాజీ డీసీసీబీ చైర్మన్, జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి మాట్లాడారు.

తనపై మావోయిస్టు పార్టీ లేఖ విడుదలంతా మంత్రి దయాకర్ రావు సృష్టించాడన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన నియోజకవర్గ అభివృద్ధి పనులు అన్ని కమీషన్ల కోసమే చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. డీసీసీబీ అధికారి కండేశ్వ రావు ఎందుకు సస్పెండ్ అయ్యారో మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాడ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడి తమతో కలిసి రావాలని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలకు, మంత్రి దయాకర్ రావుకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తమ కార్యకర్తలను పార్టీ మారాలని, వినని వారిపై పోలీసుల చేత కేసులు పెట్టిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, తాము కేసులకు భయపడి పార్టీ మారే ఆలోచన లేదన్నారు. తాను వరంగల్ డీసీసీబి బ్యాంకు అభివృద్ధి కోసం కృషి చేశాన్నారు. రూ.7 కోట్ల 99 లక్షల అవినీతి ఆరోపణలు నాపై వచ్చాయని, రూ. 2 లక్షల 29 వేల రైతుల అకౌంట్లు డీసీసీబీ పరిధిలో ఉన్నాయని, అందులో అక్రమంగా 25 మందిని నియామకం చేసి ఒక్కొక్క దగ్గర రెండు లక్షల తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల చేత కేసులు పెట్టించటమే టీఆర్ఎస్ నేతలు పనిగా పెట్టుకున్నారని వరంగల్ అర్భన్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. తమ కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టుకున్న భయపడే లేదని ఆయన ఆరోపించారు.

Tags:    

Similar News