రాజస్తాన్లో పురోహితుడి సజీవ దహనం
జైపూర్: రాజస్తాన్లో భూవివాదానికి సంబంధించి ఓ పురోహితుడిపై ఐదుగురు పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు. కాలిన గాయాలతో పురోహితుడు గురువారం రాత్రి మరణించినట్టు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. కరౌలి జిల్లాలోని సపోత్రా పోలీసు స్టేషన్ పరిధిలోని బుక్రా గ్రామంలోని రాధాగోపాల్ ఆలయంలో బాబూలాల్ వైష్ణవ్ కుటుంబం పౌరోహిత్యం చేస్తూ జీవిస్తున్నది. మందిర్ మాఫీ కింద దేవాలయానికి సంబంధించిన భూమిని జీవనాధారానికి పురోహితులు ఉపయోగిస్తుంటారు. ఈ భూమిలో బాబూలాల్ పంట వేయగా మీనా కమ్యూనిటీకి చెందిన […]
జైపూర్: రాజస్తాన్లో భూవివాదానికి సంబంధించి ఓ పురోహితుడిపై ఐదుగురు పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు. కాలిన గాయాలతో పురోహితుడు గురువారం రాత్రి మరణించినట్టు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. కరౌలి జిల్లాలోని సపోత్రా పోలీసు స్టేషన్ పరిధిలోని బుక్రా గ్రామంలోని రాధాగోపాల్ ఆలయంలో బాబూలాల్ వైష్ణవ్ కుటుంబం పౌరోహిత్యం చేస్తూ జీవిస్తున్నది.
మందిర్ మాఫీ కింద దేవాలయానికి సంబంధించిన భూమిని జీవనాధారానికి పురోహితులు ఉపయోగిస్తుంటారు. ఈ భూమిలో బాబూలాల్ పంట వేయగా మీనా కమ్యూనిటీకి చెందిన కైలాష్ మీనా వారించాడు. పంచాయితీ పురోహితుడివైపే తీర్పునిచ్చింది. అయినప్పటికీ కైలాష్ ఊరుకోలేదు. ఆ భూమిలో బాబూలాల్ వేసిన పంటకు నిప్పంటించాడు. బాబూలాల్ పైనా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాబూలాల్ గాయాలతో జైపూర్లోని ఎస్ఎంఎస్ హాస్పిటల్లో గురువారం రాత్రి చనిపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కైలాష్ను అరెస్టు చేశారని, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్టు కరౌలి ఏఎస్పీ ప్రకాష్ చంద్ తెలిపారు.